Paris S Attacks
-
మూడవ మృతదేహం స్వాధీనం
పారిస్ : పారిస్ ఉగ్రదాడి ఘటనలో మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన మహిళా జిహాదీ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. బుధవారం సెయింట్ డేనిస్ అపార్ట్ మెంట్ పై జరిగిన దాడిలో కీలకమైన ఉగ్రవాది హతమైన ప్రదేశంలో ఈ మూడో మృతదేహాన్ని కనుగొన్నామని విచారణ అధికారులు ప్రకటించారు. అయితే ఆ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. సంఘటనా స్థలంలో హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కీలక సూత్రధారితోపాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో దొరికిన పాస్ పోర్ట్ ఆ మహిళ పేరుతో ఉండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. -
పారిస్ దాడి; ఇద్దరు ముష్కరుల గుర్తింపు
పారిస్ : పారిస్ లో ఉగ్రవాద దాడి ఘటన విచారణలో ఫ్రెంచ్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన ఇద్దరు జిహాదీలను గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. ఓ అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. భీకరమైన కాల్పుల అనంతరం ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో అహ్మద్ అల్ ముహ్మద్ (25) , ఒమర్ ఇస్మాయల్ ముస్తఫా(29) ఉన్నారని గుర్తించారు. వీరిద్దరూ బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ దగ్గర దాడిచేసిన ముష్కరులుగా అనుమానిస్తున్నారు. గత వేసవిలో అహ్మద్ అల్ ముహ్మద్ సిరిమా నుంచి టర్కీకి చేరుకున్నట్టు భావిస్తున్నారు. సిరియా నుంచి టర్కీ మీదుగా గ్రీస్ కు చేరి అక్కడి నుంచి దాడులకు పథక రచన చేసినట్టు పోలీసుల భావిస్తున్నారు. ఈయూ నిబంధనలకు లోబడి శరణార్థిగా అతడు గ్రీస్ చేరినట్టు గుర్తించామని గ్రీస్ అధికారి నికోస్ చెప్పారు. పారిస్ లో అతని వివరాలను పరిశీలించినదీ లేనిదీ తెలియదన్నారు. పారిస్ లో దాడి జరిగిన ప్రాంతంలో ఓ మృతదేహం దగ్గర.. గ్రీస్ శరణార్థిగా నమోదైన సిరియాకు చెందిన ఓ వ్యక్తి పాస్ పోర్ట్ దొరికినట్టు ఫ్రెంచ్ పోలీసులు చెబుతున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ముష్కరుల్లో ఒకర్ని పోలీసులు కాల్చి చంపగా, మిగిలిన ఏడుగురు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. -
ఆ కారు దొరికింది
పారిస్: పారిస్ ఉగ్రదాడిలో కీలకమైన సాక్ష్యాలను సేకరించడంతో పోలీసులు పురోగతి సాధించారు. నగరంలో పలుచోట్ల భీకరమైన కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు వాడిన కారును పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఉపయోగించినట్టుగా అనుమానిస్తున్న ఈ బ్లాక్ సీట్ కారును మౌంట్రెయుల్ కి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బటాక్లాన్ ఏరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని పారిస్ లో నివసించే ఒమర్ ఇస్మాయిల్ ముస్తఫా(29) గా పోలీసులు గుర్తించారు. అతడి తండ్రి, అన్న, వదిన సహా ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గ్రీస్, బెల్జియం, జర్మనీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు పారిస్ దాడికి సంబంధించి అనుమానితులుగా భావించిన పలువురిని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్జియంలో అద్దెకుతీసుకున్న గ్రే పోలో కారు బటాక్లాన్ కన్సర్ట్ హాల్ దగ్గర స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి తెలిపారు.