ఆదిలాబాద్లో బాలుడి కిడ్నాప్.. సుఖాంతం | kidnapped boy found in maharashtra | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్లో బాలుడి కిడ్నాప్.. సుఖాంతం

Published Wed, Aug 26 2015 1:07 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

kidnapped boy found in maharashtra

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నాప్ కు గురైన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఇల్లు కిరాయికి కావాలంటూ వచ్చి గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని ఎత్తుకు పోయిన కిలాడీని పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన వీరాబాయి ఇంటికి సోమవారం ఓ మహిళ వచ్చి గది అద్దెకు కావాలంటూ లోపలికి ప్రవేశించింది. ఒంటరిగా ఉన్న ఆమెను మాటల్లోకి దించింది. వీరాబాయి వంటింట్లోకి వెళ్లగా అదను చూసుకుని ఆమె కుమారుడిని ఎత్తుకుని క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ మహిళ ఆచూకీ కనిపెట్టారు. నిందితురాలు మహారాష్ట్రలోని పాండ్రచౌడ గ్రామంలో ఉన్నట్లు తెలుసుకుని బాలుడితోపాటు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆమెను రిమాండ్‌కు పంపారు. సంఘటన జరిగిని 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement