ఆగి ఉన్న లారీలో మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
మిర్యాలగూడ: ఆగి ఉన్న లారీలో మృతదేహం ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఈదుల్‌గూడ బైపాస్ రోడ్డు వద్ద బుధవారం వెలుగుచూసింది. రెండు రోజులుగా అక్కడే ఆగి ఉన్న లారీపై అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా..అందులో ఓ వ్యక్తి మృతదేహం ఉంది. మృతుడు కష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నెక్కంటి సాయిప్రసాద్(50)గా గుర్తించారు. సాయి ప్రసాద్ లారీ డ్రైవర్ గా పని చేసుకుంటుండగా.. అదే లారీలో క్లీనర్‌గా పని చేస్తున్న వ్యక్తి పరారీలో ఉండటంతో.. అతనే హత్య చేసి పారిపోయాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.