కృష్ణా జిల్లాలోని మాచవరం వద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి.
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మాచవరం వద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బసచేసిన ఇంటి సమీపంలో మందుపాతర తయారీలో వినియోగించే పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వికాస్ వాదనలు వినిపించారు. ఆయనకు మైనింగ్ మాఫియా నుంచి ప్రాణహాని ఉందని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వికాస్ టార్గెట్గానే పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.