explosive
-
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
టీ20 వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్,స్ట్రయిక్ రేట్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే.. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) స్ట్రయిక్ రేట్: 176.81 జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 163.65 ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 161.72 టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 160.08 గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 150.40 ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) స్ట్రయిక్ రేట్: 155.51 రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 152.87 ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 151.16 ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన టాప్-6 టీ20 బ్యాటర్లు వీరే.. హార్ధిక్ పాండ్యా దినేశ్ కార్తీక్ హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ మొయిన్ అలీ జోస్ బట్లర్ -
పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోనే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాలు నేలమట్టమయ్యాయి. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 9 సెకండ్లలోనే పేకమేడల్లా కుప్పకూలాయి.. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఈ కూల్చివేత నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు ముందుగానే స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. పేలుడు పదార్థాల ద్వారా ‘‘కంట్రోల్డ్ ఇంప్లోజన్ ’’ (వాటర్‌ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేశారు. ఈ బిల్డింగ్ కట్టడానికి రూ.70 కోట్లు ఖర్చైతే.. కూల్చడానికి రూ.20 కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణాల కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగక్కుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. అదే విధంగా ఆ దారిలో వచ్చే వాహనాలను మళ్లించారు. #WATCH | 3,700kgs of explosives bring down Noida Supertech twin towers after years long legal battle over violation of construction laws pic.twitter.com/pPNKB7WVD4 — ANI (@ANI) August 28, 2022 -
మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలో ముగ్గురాళ్ల క్వారీ వద్ద ఈనెల 8వ తేదీన జరిగిన పేలుడుకు సంబంధించి బాధ్యులైన లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, ఎక్స్‌ప్లోజివ్ మేనేజర్ రఘునాథరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. కడపలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేలుడులో 10 మంది మృతిచెందారని, దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారిగా కడప ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్‌ను నియమించామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో మేనేజర్ లక్ష్మిరెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను ఇప్పటికే బంధువులకు అప్పగించామన్నారు. మిగిలిన మృతులను గుర్తించేందుకు నమూనాలను పరీక్షించేందుకు విజయవాడకు పంపించినట్లు తెలిపారు. ఇంకా ఈ కేసులో మైనింగ్ ఓనర్లకు, ఇతర బాధ్యులైనవారికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు, పేలుళ్లకు అనుమతులు లేవన్నారు. పేలుడు సమయానికి ముందు పులివెందుల నుంచి 20 బాక్స్‌లలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను కారులో తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎం.దేవప్రసాద్, ఎస్బీ డీఎస్పీ బీవీ శివారెడ్డి పాల్గొన్నారు. -
సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం
ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ బెదిరింపుల కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే మరో ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వాజ్ వారిని చంపి ఈ కేసును పరిష్కరించినట్లు చెప్పుకోవాలనుకున్నాడు. కాని ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో మరో ప్లాన్ అమలు చేసి పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ముఖేష్ అంబానీ ఇంటి ముందు నిలిపారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నా సమయంలో థానేలో ఉన్న వాజ్ ఇంటిని పరిశోధిస్తున్నప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందానికి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ లభించింది. పాస్ పోర్ట్ హోల్డర్, మరో వ్యక్తిని "నకిలీ ఎన్కౌంటర్"లో చంపడానికి వాజ్ ప్రణాళిక వేసినట్లు ఎన్ఐఏ బృందం అనుమానిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వారిద్దరి సహాయంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుంచి దొంగిలించబడిన మారుతి ఈకో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి అంబానీ ఇంటి ముందు నిలిపి, తర్వాత వారు దోషులను నిర్దారింఛి "ఫేక్ ఎన్కౌంటర్" చేయాలనీ మొదట ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇలా పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ కేసును పరిష్కరించి తానే ప్రశంసలు పొందాలని వాజ్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తుంది. అలాగే కొంత మొత్తం డబ్బులు కూడా డిమాండ్ చేయాలనీ చూసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏజెన్సీలలో జరిగిన "నకిలీ ఎన్ కౌంటర్" విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్యూవీ ఫిబ్రవరి 25న ముఖేష్ అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల ఆపి ఉంచినట్లు కనుగొనబడింది. ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వాహన యజమాని వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మార్చి 5న థానేలోని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. మార్చి 13న ఎన్ఐఏ సచిన్ వాజ్‌ను అరెస్టు చేసింది. చదవండి: సచిన్‌వాజే హైఎండ్ బైక్ స్వాధీనం -
ఉగ్ర భీతి.. పేలుడు పదార్థాలు స్వాధీనం
కర్ణాటక, బనశంకరి: దేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఐటీ రాజధానిలో విస్ఫోటక పదార్థాలు దొరకడం సంచలనమైంది. బెంగళూరులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది తలదాచుకున్న ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడిచేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ అదుపులో ఉన్న జేఎంబీ ఉగ్రవాది జహిదుల్ ఇస్లాం అలియాస్ కౌసర్ విచారణ సమయంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు చెప్పాడు. దీంతో మంగళవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు ఓ ఇంటిపై రహస్యంగా దాడి చేశారు. గదిలో ఎవరూ లేరు. పేలుడు వస్తువులు తయారు చేసే సమాచారం, కొన్ని ఉత్తరాలు, ప్లాస్టిక్ టేపుతో చుట్టిన బ్యాటరీ, కెపాసిటర్, మూడు స్విచ్‌లు, ఒక మైక్రో లిథియం బాటరీ, ఒక ప్లాస్టిక్ బాక్స్‌ను కనుగొన్నారు. చేతి గ్లౌజ్‌లు, గుర్తింపుకార్డులు, ఇంటి అద్దె ఒప్పంద పత్రం, బెంగాళీ బాషలో రాసిన పత్రం, ఒక డిజిటల్ కెమెరా, 2018లో బెంగళూరులో దొంగగించిన కొన్ని వెండిపాత్రలను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని అత్తిబెలె, కాడుగోడి, కేఆర్.పురం, చిక్కబాణవార, శికారిపాళ్య, ఎలక్ట్రానిక్‌సిటీ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సహాయపడే సహాయకులు గుట్టుగా మకాం వేసినట్లు మరోసారి వెల్లడైంది. -
గుంటూరు తాడేపల్లిలో పేలుడు బాలుడు మృతి
-
కూలీలుగా వచ్చి.. పేలుడు పదార్థాలు సేకరించి
► ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టుల ప్రణాళిక ► భారీగా మందుగుండు సామగ్రి చోరీ చేసి రహస్య ప్రాంతంలో నిల్వ ► వారం రోజుల్లో తరలించేందుకు వ్యూహం ► ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా గుర్తింపు ► ఉమ్మడి ఆపరేషన్‌తో కుట్ర భగ్నం కర్నూలు: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన నలుగురు మావోయిస్టుల అరెస్టు కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. అవుకు మండలం మెట్టుపల్లి వద్ద జరుగున్న గాలేరు–నగరి టన్నెల్ పనుల వద్ద కూలీలుగా అవతారమెత్తిన మావోయిస్టులను పోలీసులు ‘ఉమ్మడి ఆపరేషన్’తో అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బస్తర్ పోలీస్ రేంజ్ పరిధిలోని ఏడు జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అక్కడి పోలీసులు మావోయిస్టులపై ఒత్తిడి పెంచడంతో మిలిషియా కమాండర్‌గా ఉన్న కవాసి భీమా(22)తో పాటు పోడియం లక్మా లక్మా(26), హిడ్మా కర్టామి(22), కట్టాడు ఉంగా(22) తదితరులు మకాం మార్చి గాలేరు–నగరి టన్నెల్ వద్ద కూలీలుగా చేరారు. మొదట నెలల మాసాల క్రితం కవాసి భీమా టన్నెల్ పనుల్లో కూలీగా చేరి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని తిరిగి వారి ప్రాంతానికి వెళ్లి మిగిలిన ముగ్గురిని కూడా తీసుకువచ్చి కూలీలుగా కుదిర్చాడు. మావోయిస్టు నాయకులతో ఇక్కడి నుంచే ఫోన్లో సంబంధాలు కొనసాగిస్తూ పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేసేందుకు వ్యూహరచన చేశారు. టన్నెల వద్ద బ్లాస్టింగ్ మెటీరియల్స్‌ను పెద్ద మొత్తంలో చోరీ చేసి రహస్య ప్రదేశంలో దాచి వుంచారు. మరో వారం రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌కు రవాణా చేసేందుకు ప్రణాళిక రచించారు. అయితే ఛత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్’ సాగిందిలా... ఛత్తీస్‌ఘడ్ పోలీస్ టీమ్ బస్తర్ సైబర్ సెల్ ఇన్చార్జి మోహన్‌నాయుడు, ఏఎస్ఐలు శివాజి, సంతోష్బగేల్, హెడ్ కానిస్టేబుల్ సుశీల్ బరువా తదితరులతో కూడిన బృందం పక్కా సమాచారంతో మూడు రోజుల క్రితం అవుకులో తిష్ట వేశారు. గాలేరు–నగరి టన్నెల్ పనుల్లో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన సుమారు 60 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారిలో పై నలుగురిపై రెండు రోజుల పాటు పక్కా నిఘా ఉంచారు. పుష్కర విధుల్లో ఉన్న జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణకు రాష్ట్ర పోలీసు అధికారుల ద్వారా సమాచారం చేరడంతో జిల్లా పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. డోన్ సీఐ వై.శ్రీనివాసులు, అవుకు, బనగానపల్లె, కొలిమిగుండ్ల, డోన్ ఎస్ఐలు సుబ్రహ్మణ్యంరెడ్డి, వెంకటరామిరెడ్డి, సి.ఎం.రాకేష్, పులిశేఖర్, కానిస్టేబుళ్లు కృష్ణయ్య నాయుడు, సూర్యప్రకాష్, రమేష్, నగేష్‌తో పాటు మరికొంతమంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఛత్తీస్‌ఘడ్ పోలీసులతో ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టన్నెల్ ప్రాంతంలో పోలీసులను మొహరించి నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకే రవికృష్ణ కూడా అవుకు చేరుకుని పోలీసు బృందాలకు తగు సూచనలిస్తూ పేలుడు పదార్థాల రహస్య ప్రదేశంపై దాడులు నిర్వహించారు. వారి నుంచి ఏడు జిలెటిన్ స్టిక్, 28 డిటోనేటర్స్, 20 బూస్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం వారిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలను వెల్లడించిన అనంతరం బనగానపల్లె కోర్టులో హాజరుపరిచారు. వీరి నేరాల చిట్టా... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింద్గడ్ మండలం పెద్దపార వీరి స్వగ్రామం. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వీరిపై అనేక కేసులు ఉన్నాయి. కవాసి భీమా మిలిషియా కమాండర్‌గా, కాట్టె కల్యాణ్ ఏరియా కమిటీలో సెక్రటరీ జగదీష్, ఇన్చార్జి కమాండర్ డి.సి.ఎం.దేవా నేతత్వంలో వీరు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. – 2014 సాధారణ ఎన్నికల ముందు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జగ్బల్పూర్ దగ్గర జీరంలో ఎన్నికల ప్రచారంలో విధ్వంసం సష్టించి 43 మంది కాంగ్రెస్ నాయకులను అంతమొందించారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు విద్యాచరణ్ శుక్లా, మహేంద్ర కర్మా మతి చెందిన విధ్వంసంలో కవాసి భీమా ప్రముఖ పాత్ర పోషించాడు. – పోడియం లక్మా లక్మా, హిగ్మా కర్టామి, కట్టాడు ఉంగా తదితరులు దళ కమాండర్ కవాసి భీమాతో కలసి మాన్కాపాల్ వద్ద జరిగిన ఫైరింగ్లోను, గాంధీరామ్ పీఎస్ పరిధిలో జరిగిన ఎన్నికల బూత్ విధ్వంసం, తోంగ్‌పాల్ పీఎస్ పరిధిలో నేషనల్ హైవే విధ్వంసం సంఘటనల్లో పాలుపంచుకున్నారు. పోలీసులకు నగదు రివార్డు నలుగురు మావోయిస్టులను చాకచక్యంగా పట్టుకుని వారు పన్నిన కుట్రను భగ్నం చేసినందుకు ఛత్తీస్‌ఘడ్ పోలీస్టీమ్తో పాటు కర్నూలు జిల్లా పోలీసులకు ఎస్పీ ఆకే రవికృష్ణ నగదు రివార్డులు ప్రకటించారు. సుకుమా జిల్లా ఎస్పీ కళ్యాణ్‌తో కలసి నగదు రివార్డును ఎస్పీ ఆకే రవికృష్ణ ఛత్తీస్‌ఘడ్ పోలీసులకు అందజేశారు. -
పేలుడు పదార్థాల లక్ష్యం ఆయనేనా?
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మాచవరం వద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బసచేసిన ఇంటి సమీపంలో మందుపాతర తయారీలో వినియోగించే పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వికాస్ వాదనలు వినిపించారు. ఆయనకు మైనింగ్ మాఫియా నుంచి ప్రాణహాని ఉందని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వికాస్ టార్గెట్‌గానే పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.