మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్‌పూర్‌లోని బజార్‌గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు.
ఇది కూడా చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె?
Comments
Please login to add a commentAdd a comment