Material
-
వారి చేతుల్లో.. వ్యర్థాలు కూడా బొమ్మలవుతాయి..
ఈ మహిళల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు ఒక్కోటి ఒక్కో కథ చెబుతుంటాయి. బొమ్మల శరీరాలు కాటన్ కాన్వాస్‌తో విభిన్న రంగులతో సాంస్కృతిక వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. మూస దోరణులకు భిన్నంగా స్త్రీల చేతుల్లో తల్లీ–బిడ్డలు, భార్యాభర్తలు, పిల్లల బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ శరణార్థ మహిళలకు హస్తకళల్లో నైపుణ్యాలకు శిక్షణ ఇస్తూ ఫ్యాబ్రిక్ వ్యర్థాలతో అందమైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులను రూపొందిస్తుంది ఐరిస్ స్ట్రిల్. శరణార్థులకు స్థిరమైన ఆదాయవనరుగా మారడమే కాదు పర్యావరణ హితంగానూ తనదైన ముద్ర వేస్తోంది.భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ డిజైనర్ ఐరిస్ స్ట్రిల్. టెక్స్టైల్, క్రాఫ్ట్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్ క్రియేటివ్ డిజైనర్. ఆమె భర్త బిశ్వదీప్ మోయిత్రా ఢిల్లీవాసి. కళాకారుల ప్రతిభను పెంపొందించడం, మహిళా సంఘాలనుప్రోత్సహించడం, ట్రెండ్‌ను అంచనా వేయడం, అట్టడుగు హస్తకళాకారుల కోసం వారి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో ఐరిస్ విస్తృత స్థాయిలో పని చేస్తుంది. దేశంలోని హస్తకళాకారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందమైన ఇండియన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు, వస్త్రాల తయారీలో మిగిలి పోయిన వస్త్రాల గుట్టలను చూస్తూ ఉండేది.పర్యావరణ అనుకూలమైన ఆలోచన..‘‘ఈ వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నాళ్లు పాటు ఆలోచించాను. అదే సమయంలో అఫ్ఘాన్ మహిళా శరణార్థులను శక్తిమంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాను. ఇక్కడ డిజైన్ పని చేస్తున్న సమయంలో తరచూ భారతీయ గ్రామీణ మహిళలకు వారి సంప్రదాయ నైపుణ్యాలను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్‌లను చేయడం మొదలుపెట్టాను.ఆ విధంగా అనేకమంది హస్తకళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్హెచ్సిఆర్) జీవనోపాధి కార్యక్రమాలలో భాగమైన ఆప్ఘన్ శరణార్థ మహిళలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను. అలా నాలో శరణార్థులతో కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచే ‘సిలైవాలి’ సంస్థ పుట్టింది. పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చేతి వృత్తుల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందడంలో అట్టడుగున ఉన్న కళాకారులకు సహాయపడే ఒక సామాజిక సంస్థను నెలకొల్పాను. బొమ్మలు శరణార్థ మహిళల ప్రత్యేకతగా మారినప్పటికీ, ఇతర గృహోపకరణాలు కూడా వారు తయారుచేస్తారు.స్థిరమైన ఆదాయం..మా ఉత్పత్తులు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. వీటికి సరైన ధరలను నిర్ణయించి, వాటి ద్వారా కళాకారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి సహాయపడేందుకు ఒక స్థిరమైన ఆదాయానికి కల్పిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడాలనే ఉద్దేశంతోనూ, వారి స్వదేశంలో అస్థిరత కారణంగా పారిపోతున్న అఫ్ఘాన్ శరణార్థులకు న్యూఢిల్లీ ఒక ఇల్లుగా చెప్పవచ్చు.సిలైవాలి సంస్థ ద్వారా 70 మంది మహిళా శరణార్థులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. శరణార్థుల ఇళ్లకు కూతవేటు దూరంలో పరిశుభ్రమైన పని వాతావరణం, పిల్లలను కూడా పనిలోకి అనుమతించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఈ సంస్థ ద్వారా తయారైన బొమ్మలు, ఇతర అలంకార వస్తువులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా కాన్సెప్ట్ స్టోర్లలో అమ్మకానికి ఉన్నాయి. దేశరాజధానిలో సొంత స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా అమ్మకాలను జరుపుతున్నాం.కళాత్మక వస్తువులను క్లాత్‌తో రూపొందించడం వల్ల ఫ్యాషన్ దృష్టిని ఆకర్షిస్తున్నాం. వేస్ట్ ఫ్యాబ్రిక్‌ను అందమైన స్మారక చిహ్నాలు, గృహాలంకరణలో హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల తయారీకి మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. దీనితో కళాకారుల నుంచి మహిళలు కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకుంటున్నారు.సోషల్ మీడియా ద్వారా మా ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గ్యారెంటీడ్ ఫెయిర్ ట్రేడ్ ఎంటర్‌ప్రైజ్‌గా వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. మా సంస్థ ద్వారా గుడ్డ బొమ్మలు, బ్యాగులు, ఆభరణాలు తయారు చేస్తాం’’ అని వివరిస్తారు ఈ క్రియేటర్.ఇవి చదవండి: పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం.. -
డీఎస్సీ హడావుడి షురూ
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ హడావుడి మొదలైంది. మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు వెతుకుతున్నారు. అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మెటీరియల్ ఇస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే జూలై 17 నుంచి 31 వరకూ ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది డీఎస్సీకి 1.70 లక్షల దరఖాస్తులు వస్తే, ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకూ మరో 25 వేల మంది వరకూ దరఖాస్తు చేశారు. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకూ డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశముంది. మొత్తంగా 3 లక్షల మంది ఈ ఏడాది డీఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచింగ్ తీసుకునేందుకు 1.50 లక్షల మందికిపైగా హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తేలికగా ఉండదని... ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కొన్ని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి. 2017 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, టెట్ ఉత్తీర్ణత సాధించినవారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు. పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు. గతంలో మాదిరి తేలికైన, సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించొచ్చని చెబుతున్నారు. నూతన విద్యావిధానం అమలులోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బోధన మెళకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డీఎస్సీలో ఉంటుందని నిపుణులూ అంటున్నారు. గత కొంతకాలంగా బీఈడీ, డీఎడ్‌లో ఇవన్నీ లేవని, కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డీఎస్సీ తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, నిర్దేశించిన సిలబస్ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని, కాకపోతే నవీన బోధన విధానాలు, సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనినిబట్టి అకడమిక్ పుస్తకాలకు అందని రీతిలో డీఎస్సీ ఉంటుందా? అనే సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోటీ పెంచుతున్న కోచింగ్ సెంటర్లు కొత్త స్టడీ మెటీరియల్ రూపకల్పన, ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మూడు నెలల కాల పరిమితితో కూడిన డీఎస్సీ కోచింగ్ సిలబస్ రూపొందిస్తున్నాయి. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే 20 ప్రముఖ కోచింగ్ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. మరో వంద వరకూ చిన్నాచితక సెంటర్లు వెలిశాయి. స్వల్పకాలిక కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్ ఉంటుందని చెబుతున్నాయి. డీఎస్సీ రాసేవారిలో నాలుగేళ్ల ముందు బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన వారున్నారు. ఒక్కసారిగా సిలబస్ మారుతోందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది. అయితే, మెథడాలజీ, సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా కోచింగ్ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. -
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇకపై
న్యూ ఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ఐఓసీఎల్ విడుదల చేసిన స్మార్ట్ సిలిండర్లతో గ్యాస్ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్ రిలీజ్ చేసిన స్మార్ట్ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్ సిలిండర్లు మాదిరి స్మార్ట్ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ►నార్మల్ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ►ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ►వినియోగదారులు సులభంగా రీఫిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ►స్టీల్ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. ►మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్ చేశారు. ►ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. ►వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి 10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ►ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది. ►మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ►ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. -
ఇల్లు.. గుభేలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : నిర్మాణ రంగంపై ధరల భారం పెరిగిపోయింది. నిర్మాణ సామగ్రి ధరల్లో కొద్దిరోజుల్లోనే విపరీతమైన వ్యత్యాసం రావడంతో ఈ రంగం కుదేలవుతోంది. ముందుగా వేసుకున్న బడ్జెట్‌కు మించి ఖర్చు చేయాల్సి రావడంతో భవన నిర్మాణాలు చేపట్టిన వారు పనులను మధ్యలోనే నిలిపేస్తున్నారు. జూలై 1నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రానుంది. ఇది నిర్మాణ రంగంపై గోరుచుట్ట మీద రోకలిపోటులా పరిణవిుంచనుందనే ఆందోళన నెలకొంది. పెరిగిన ఐరన్, సిమెంట్ ధరలు భవన నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ 6 నెలల క్రితం వరకూ టన్ను రూ.32 వేల (టీఎంటీ) నుంచి రూ. 36 వేల (ప్లాంట్) వరకూ ఉండేది. ప్రస్తుతం వాటి ధర రూ.39 వేల (టీఎంటీ) నుంచి రూ. 43 వేల (ప్లాంట్) వరకూ పెరిగింది. నిర్మాణ రంగంలో మరో కీలకమైన సిమెంట్ ధర మంటెక్కిస్తోంది. సాధారణంగా అన్‌సీజన్‌లో సిమెంట్ బస్తా రూ.220 నుంచి రూ.240 మధ్య ఉండేది. దీని ధర ఒక్కసారిగా రూ.330కి చేరుకుంది. బస్తాకు రూ.100 వరకు పెరిగిన ధర వల్ల సాధారణ గృహ నిర్మాణ బడ్జెట్లో రూ.2 లక్షల వరకు అదనంగా వెచ్చించాల్సి రావడంతో పనులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇటుక.. ఇసుకదీ అదేదారి ఇసుక, ఇటుక ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గతంలో వెయ్యి ఇటుకలు రూ.3,500 ఉండగా ఇప్పుడు రూ.5,500 వెచ్చించాల్సి వస్తోంది. ఇసుక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కారణంగా ఉచి తంగా అందాల్సింది పోయి దానికీ వేలల్లోనే చెల్లించాల్సి వస్తోంది. ఇసుక వ్యాపారం మాఫియా చేతిలోకి వెళ్లటంతో దీని ధర కూడా బాగా పెరిగిపోయింది. యూనిట్‌కు రూ.2,500 వరకు చెల్లించాలి్సన దుస్థితి నెలకొంది. గృహ నిర్మాణానికి ఉపయోగించే అన్ని వస్తువుల ధరలూ నింగివైపు చూస్తుండటంతో యజమానులు నిర్మాణ పనులను ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అన్‌సీజన్ అయినా తగ్గని ధరలు వేసవి ముగిసి వర్షాకాలం రావడంతో గృహ నిర్మాణ రంగం అన్‌సీజన్‌లో పడింది. ఆషాఢ మాసం రాబోతున్న తరుణంలో గృహ నిర్మాణాలను ప్రారంభించరు. దీంతో నిర్మాణ సామగ్రికి పెద్దగా డిమాండ్ ఉండదు. అయినా.. ప్రస్తుతం వాటి ధరలు దిగిరాకపోవడం విశేషం. ఉపాధి కోల్పోతున్న కార్మికులు వర్షాకాలంలో నిర్మాణాలు తగ్గి కూలీలు సహజంగానే ఉపాధి కోల్పోతుంటారు. ఈ ఏడాది ఇప్పటికీ ధరలు తగ్గకపోవడం, ప్రారంభించిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడంతో వర్షాకాలం తొలి రోజు ల్లోనే కూలీలు ఉపాధికి దూరమౌతున్నారు. రోకలిపోటులా జీఎస్టీ జూలై 1నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ ప్రభావం గృహ నిర్మాణ సామగ్రిపైనా పడనుంది. టైల్స్, ఫ్లైయాష్ బ్రిక్స్, వాల్ పేపర్స్, పెయింట్లు వంటి గృహనిర్మాణ వస్తువుల ధరలు జీఎస్టీ ప్రభావంతో పెరిగే అవకాశముంది. గతంలో ఎప్పుడూ లేదు నిర్మాణ రంగంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. వర్షాకాలంలో నిర్మాణ వస్తువుల ధరలు తగ్గాల్సి ఉంది. ప్రస్తుత తీరును విశ్లేషిస్తే ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. కొత్తగా అమల్లోకి రాబోతున్న జీఎస్టీ ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. – కె.సోమశేఖర్, సివిల్ ఇంజినీర్, ఏలూరు -
'ఆ బిల్డింగ్‌కు సరైన డిజైనింగ్ లేదు'
-
పేలుడు పదార్థాల లక్ష్యం ఆయనేనా?
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మాచవరం వద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బసచేసిన ఇంటి సమీపంలో మందుపాతర తయారీలో వినియోగించే పదార్థాలు లభ్యం కావడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వికాస్ వాదనలు వినిపించారు. ఆయనకు మైనింగ్ మాఫియా నుంచి ప్రాణహాని ఉందని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వికాస్ టార్గెట్‌గానే పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారుల రెక్కల కష్టంతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు!
ప్రముఖ టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు బాల కార్మికుల కష్టాల్లోని భాగాలేనని ఓ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక భాగం జనం ఆదరిస్తున్నకోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో చిన్న తరహా మైనింగ్ కేంద్రాలనుంచి వస్తుందని, ఈ కేంద్రాల్లో పని చేసే కార్మికులు సుమారు ఏడు సంవత్సరాల వయసులోపు వారే ఉంటారని సర్వే చెప్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆపిల్, శామ్సంగ్, సోనీ, మైక్రోసాఫ్ట్ తయారీదారులు కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను సేకరిస్తున్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. కొత్త టెక్నాలజీని వాడుకుంటూ ఆనందిస్తున్న కోట్లమంది జనాభాలో ఏ ఒక్కరూ ఆ విషయాన్ని ఆలోచించరని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవహక్కుల పరిశోధకుడు.. మార్క్ డమ్మెట్ ఓ ప్రకటనలో తెలిపారు. షాపింగ్ మాల్స్ లో పేర్చి, కళాత్మకంగా అమ్మకాలు జరిపే ఆ వస్తువుల వెనుక.. ఇరుకైన సొరంగాల్లో... రాళ్ళ సంచులు మోస్తూ, బాల్యం మసకబారుతోందని, శాశ్వత ఊపిరితిత్తుల సమస్యలకు ఆ బాలకార్మికులు గురౌతున్నారని ఆయన అన్నారు. భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్ ను ఉపయోగించి సుమారు 12 గంటల పాటు పనిచేస్తే వారికి ఒకటినుంచి రెండు డాలర్లు చెల్లిస్తారని రిపోర్టులు చెప్తున్నాయి. సొంరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను చిన్నారులు వెలికి తీస్తే... దాన్ని మధ్యవర్తులు అమ్మకాలు జరిపి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో సుమారు 40,000 మంది పిల్లలు రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేస్తున్నట్లుగా 2014 లోనే యునిసెఫ్ అంచనా వేసింది. ఈ పదార్థాలను ఎగుమతి దారులునుంచి చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు కొనుగోలు చేసి, వాటి ఉత్పత్తులను ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు ఆమ్నెస్టీ వివరిస్తోంది. అయితే శామ్సంగ్, సోనీ సహా... పలు కంపెనీలు ఈ విషయాన్ని నిర్థారించేందుకు, అంగీకరించేందుకు నిరాకరించాయి. కాగా యాపిల్ సంస్థ మాత్రం కోబాల్ట్ సహా బ్యాటరీ పదార్థాల సరఫరా వెనుక బాలకార్మికులు ఉన్నారా లేదా అన్న విషయాలను గుర్తిస్తామని తెలిపింది. ఇలా ఎగుమతి అయిన కోబాల్ట్ ను ప్రత్యేకంగా ఏ కంపెనీలు ఎటువంటి ఉత్సత్తుల్లో వినియోగిస్తున్నాయో నివేదికలు గుర్తించలేకపోయాయని... ఇది చింతించాల్సిన విషయమని మానవహక్కుల పరిశోధకుడు డమ్మెట్ విచారం వ్యక్తం చేశారు. -
జాకెట్స్... జిగ్‌జాగ్...
మార్కెట్లో వీటికి సంబంధించిన ఎంతో రా మెటీరియల్ అందుబాటులో ఉంది. వీటిని కొద్ది మార్పులతో మీ శరీరాకృతికి నప్పే విధంగా కుట్టుకోవచ్చు. కత్తెర, ఫ్యాబ్రిక్ గ్లూ, అద్దాలు, ప్యాచ్‌లు దగ్గర ఉంచుకుంటే ఎంచుకున్న జాకెట్‌ను మీకు తగినవిధంగా మీరే డిజైన్ చేసుకోవచ్చు. గ్లూతో అతుకుపెట్టదగిన ప్లాస్టిక్ అద్దాలను ఎంచుకుంటే ప్రత్యేకమైన మెజర్మెంట్స్ కూడా అవసరం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు పేస్ట్ చేసుకోవచ్చు. జాకెట్ స్ట్రిప్కి బాటమ్ కలర్ స్ట్రిప్ అంచుగా జతచేసి, దాని మీద వరుసగా మిర్రర్స్‌ను అతికించినా సరిపోతుంది. రకరకాల పూసలతో డిజైన్ చేసిన ప్యాచ్‌వర్క్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. జాకెట్‌ను మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ సాయపడతాయి. ఇదే విధంగా లెహంగా, చోళీలను మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు. -
ఉక్కు ఎస్ఎంఎస్లో ఉత్పత్తి బంద్
నిలిచిపోయిన మరో కన్వర్టరు రెండు వారాలు ఉత్పత్తికి విఘాతం విశాఖపట్నం: విశాఖ ఉక్కులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్టీల్ మెల్ట్ షాప్-2లోని కన్వర్టర్-1 కూడా మరమ్మత్తులకు గురి కావడంతో విభాగంలో ఉత్పత్తి నిలిచిపోయింది. 13రోజుల పాటు ఉత్పత్తికి అంతరాయం కలగనున్నది. దీని ప్రభావం వల్ల విభాగం వార్షిక లక్ష్యాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. వారం రోజుల క్రితం విభాగంకు చెందిన కన్వర్టర్-2కు రంధ్రం పడటంతో ఆ కన్వర్టర్ నిలిచిపోయిన విషయం విదితమే. ఒక్క కన్వర్టర్‌తో ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న మొదటి కన్వర్టర్‌కు చెందిన షెల్ హీట్ పెరిగిపోవడం గమనించారు. రిఫ్రాక్టరీ లైనింగ్ పాడైందని గుర్తించి దానిని మరమ్మతులకు అందించారు. విభాగం కన్వర్టర్లకు అవసరమైన రిఫ్రాక్టరీ బ్రిక్స్ సరఫరా లేకపోవడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తినట్టు సమాచారం. రెండో కన్వర్టర్‌కు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. అది పూర్తికావడానికి మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. విభాగంలో రెండు కన్వర్టర్లు ఉండగా కేవలం ఒక కన్వర్టర్‌కు సరిపడా రిఫ్రాక్టరీ మెటీరియల్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రెండో కన్వర్టర్‌కు చెందిన లైనింగ్‌ను మొదటి కన్వర్టర్‌కు అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ను సకాలంలో సరఫరా చేయకపోవడం, యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
గతి తప్పిన గ్రంథాలయాలు
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రంథాలయాల పరిస్థితి అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కొంత అభివృద్ధి చెందిన అసౌకర్యాలు పోలేదు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు లేవు. గ్రూపు పరీక్షలకు సంబంధించిన మెటిరియల్ లేక గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చుచేసి పుస్తకాలు కొనాల్సినపరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని రెండో గేటు ప్రారంభానికి నొచుకోవడం లేదు. అరకొరగా పుస్తకాలు పాతవాటినే వాడుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం లేదు. జైనథ్ మండల కేంద్రంలోని గ్రంథాలయాల ప్రాథమిక పాఠశాలలో అద్దె భవనంలో కొనసాగుతోంది. అక్కడ అటెండరే లైబ్రేరియన్‌గా మారాడు. లైబ్రేరియన్ ఉన్నా లేనట్టేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఉంది. ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు తెరువరో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. సదరు లైబ్రేరియన్ గ్రంథాలయ సంస్థ నాయకుడిగా ఉన్నందున అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. బేల మండలంలోని గ్రంథాలయం మరాఠి మీడియం ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. వసతులు లేకుండా ఉంది. కేవలం న్యూస్‌పేపర్లు మాత్రమే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. ఎటు చూసినా అసౌకర్యాలే ఇచ్చోడ : చిరిగిన చొక్కా అయిన తొడుక్కొ.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కొ అన్నారో కవి. అంటే పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, అవగాహన మనిషికి ఎంత అవసరమో స్పష్టమవుతోంది. పుస్తకాలు కొనలేని వారు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. కానీ గ్రంథాలయాల్లో అనింన రకాల పుస్తకాలు ఉండడం లేదు. నిధుల కొరతతో ఈ సమస్య ఉంది. దీంతో విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలు ఏ జ్ఞానమూ అందించలేకపోతున్నాయి. గదులు సరిపోక పుస్తకాలు, పత్రికలను నిల్వ చేసే పరిస్థితి కూడా చాలాచోట్ల లేదు. ప్రభుత్వ పట్టింపులేనితనం ఈ దుస్థితికి కారణమవుతోంది. బోథ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గ్రంథాలయాలను అసౌర్యాలు వెంటాడుతున్నాయి. తలమడుగు, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయల్లో కొన్ని, అద్దె భవనాల్లో మరిన్ని కొనసాగుతున్నాయి. పుస్తకాలు పెట్టే స్థలం లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య చదవలేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చోడలో భవనం ఉన్నా సరిపడా ఫర్నిచర్ లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడంలేదు. నేరడిగొండ మండలంలో గ్రంథాలయం పంచాయతీకి చెందిన ఇరుకు గదిలో కొనసాగుతోంది. బోథ్ గ్రంథాలయం 30 ఏళ్లుగా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఇచ్చిన భవనంలో అరకొర వసతులు మధ్య కొనసాగుతోంది. గుడిహత్నూర్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒకే గది దిక్కయిందిక్కడ. ఇక్కడి గ్రంథాలయ అధికారి తరచూ రాకపోవడంతో గ్రంథాలయం మూసే ఉంటోంది. బజార్హత్నూర్ మండల గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో ప్రస్తుతం పశువైద్యశాలకు చెందిన భవనంలోనే తాత్కాలికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ పాఠకులకు తీవ్ర తిప్పలు తప్పడం లేదు. నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో? నిర్మల్ : నిర్మల్‌లో 1958లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మొదట గాంధీచౌక్‌లో ఓ అద్దె భవనంలో దీనిని నిర్వహించారు. 1960లో పౌర గ్రంథాలయ చట్టం అమలులోకి రావడంతో డీఈవో పరిధిలోకి, అనంతరం గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ ఏర్పడడంతో 1962లో గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. అద్దె భవనం కావడం, అక్కడ సమస్యలు తెలత్తడంతో 2004 నవంబర్‌లో నిర్మల్ పాలించిన పాలకులు నిర్మించిన వందల ఏళ్ల నాటి సర్ద్మహాల్ (శీతలమందిరం)లోకి మార్చారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న భవనం పురాతనమైనది కావడం, ఒకటే గది ఉండడం అది కూడా పుస్తకాలను భద్రపర్చేందుకే సరిపోతోంది. దీంతో వచ్చే పాఠకులు ఆరుబయటే చదువుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే భవనం వెనుకభాగంలో ఉన్న బావిలో నుంచి విషసర్పాలు, తేళ్లు వంటి వస్తుండడంతో అధికారులు, పాఠకులు భయాందోళనల మధ్య పఠించే పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రంథాలయ ఆధునికీకరణకు గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. కానీ నేటికీ అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజకవర్గంలోని మామడలో పురాతన భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతోంది. మిగతా మండలాలకు గ్రంథాలయ భవనాలున్నా ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. -
ఎడ్యు న్యూస్
త్వరలో అన్ని యూనివర్సిటీల్లో ఉచిత వైఫై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో రానున్న రోజుల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో నాణ్యమైన మెటీరియల్ పొందవచ్చు. ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్న ఎన్నో విద్యా సంస్థలకు వైఫై సౌకర్యం ఎంతో లాభదాయకం. వైఫై ద్వారా దేశవ్యాప్తంగా 600 యూనివర్సిటీలు, 20 వేల కళాశాలలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉచిత ఇంటర్నెట్ ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (మూక్స్) అభ్యసించడానికి కూడా వీలు కలుగుతుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన ఫ్యాకల్టీ చెప్పే వీడియో లెసన్స్, గెస్ట్ లెక్చర్స్‌ను చూడొచ్చు. ఇప్పటికే మనదేశంలో కొన్ని విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. నెట్‌ను నిర్వహించనున్న సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), కళాశాలల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలంటే రాయాల్సిన పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్). ఇప్పటివరకు దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించింది. ఈ ఏడాది డిసెంబర్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నెట్‌ను నిర్వహిస్తుందని యూజీసీ వెల్లడించింది. విద్యా సంస్థల్లో డీఆర్డీవో.. టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ముందుగా ఐఐటీ - బాంబే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ - కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖల మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డీఆర్డీవో ఈ కేంద్రాల్లో శాస్త్రవేత్తలు, రీసెర్చ్ ఫ్యాకల్టీతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంది. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు పరిశోధనల్లో అత్యుత్తమ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. 2012లో ఐఐటీ - చెన్నైలో డీఆర్డీవో .. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. -
ఓటర్ల మెడలో గుడి‘గంట’!
అడిగితే చాలు గ్రామాలకు తాయిలాలు గుడుల నిర్మాణానికి మెటీరియల్ గ్రామ పెద్దలతో ప్రమాణాలు చేయించి మరీ సరఫరా భీమిలిలో ప్రలోభాల ప్రహసనం తగరపువలస, న్యూస్‌లైన్: భీమిలిలో ప్రతికూల పవనాలు వీస్తూ ఉండడంతో హతాశుడైన టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తనకు పరిచయమైన పాత బాట పట్టాలని నిశ్చయించుకున్నట్టు ఉంది. తాయిలాలు, పారితోషికాలతో ఓటర్లపై ప్రలోభాల వల విసరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఊళ్ల వారీగా, వీధుల వారీగా ఓటర్లకు గాలం వేసి తన పబ్బం గడుపుకోవాలని నిశ్చయించినట్టు తేటతెల్లవుతోంది. నోట్లు వెదజల్లయినా తనపై గల వ్యతిరేకతను తొలగించుకోవాలని ఆరాటపడుతున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్ధమవుతోంది. మరీ ముఖ్యంగా స్థానికేతరుడన్న మచ్చ తొలగించుకోవడానికి ఎంతకైనా సిద్ధపడేట్టు కనిపిస్తోంది. గ్రామానికో కమ్యూనిటీ హాలు, వార్డుకో గుడి నిర్మించుకోవడానికి ఇప్పటికే గంటా పచ్చజండా చూపారని తెలియవచ్చింది. ఇందుకోసం మెటీరియల్, డబ్బుతో ఆశ పెడుతూ ఓట్లు తనకే వేయాలని గ్రామపెద్దలతో ప్రమాణాలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు పదేళ్ల క్రితం భీమిలి మున్సిపాల్టీకి చైర్పర్సన్ కావాలని భంగపడి టీడీపీ అధిష్టానాన్ని తిట్టిపోసి పార్టీకి దూరంగా ఉన్న నాయకురాలు మళ్లీ గంటా పుణ్యమాని టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు గంటా తరపున మళ్లీ వార్డు ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈమె 11,12 వార్డుల మహిళలతో గంటా తరపున బేరసారాలు సాగించారు. ఆయా వార్డులలో తెలుగు తమ్ముళ్లుగా పేరుపడ్డ నాయకులు వార్డుకో కమ్యూనిటీ హాలు,గుడిని నిర్మించాలని రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. దాంతో వార్డుకు రూ.5 లక్షలు ఇవ్వడానికి గంటా సమ్మతించినట్టు తెలిసింది. 25వ వార్డులో మూడురోజుల క్రితం భూమిపూజ జరిగిన రామాలయానికి గ్రామస్తులు ఇచ్చిన విరాళం కన్నా టీడీపీ అభ్యర్థి గంటా ఎక్కువ సమకూర్చారని వినవస్తోంది. ఎన్నికల ముందు లక్ష విలువైన మెటీరియల్ ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలియవచ్చింది. టన్ను ఇనుము,రెండు లారీల ఇటుక, నాలుగు యూనిట్ల పిక్క, వంద సిమెంటు బస్తాలు ఈ ‘ప్యాకేజీ’లో భాగమని తెలుస్తోంది. హామీ ఇచ్చిన తక్షణం ఆఘమేఘాల మీద మెటీరియల్ పంపడంతో గ్రామ పెద్దలే ఆశ్చర్యపోతున్నట్టు తెలియవచ్చింది. మెటీరియల్ ఇప్పించిన మాజీ పట్టణ అధ్యక్షుడు గంటా తరపున రాముని ఫొటోపై గ్రామస్తులతో ఒట్లు వేయించుకున్నారని వెల్లడైంది. ఒక్క భీమిలిలోనే కాకుండా మూడుమండలాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇదే ధోరణి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసేలోగా ఆలయాల పేరుతో ఒట్లేయించి ఓట్లు కొట్టేయాలని గంటా అనుచరులు పథకం వేస్తున్నట్టు తెలియవచ్చింది. ఇంత హడావుడి చేస్తున్న మంత్రి పదవిలో ఉన్నప్పుడు చిట్టివలస జ్యూట్ మిల్లు తెరిపించలేకోయారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. -
షగ్ర్... వెచ్చని హగ్
‘ఏమో నాకేం తెల్సు?’ అని భుజాలు ఎగరేయడం... ‘షగ్ర్ ర. ‘చలి బాగా ఎక్కువైంది కదండీ’ అన్నప్పుడుఎవరైనా ‘షగ్ర్ చేశారనుకోండి... ఏమిటర్థం? ఏముందీ... వాళ్లు షగ్ర్ వేసుకుని ఉన్నారని! షగ్ర్ వేసుకున్నమ్మకు చలి తెలిస్తే కదా. స్టెయిల్‌గా ఎన్నిసార్లయినా భుజాలు ఎగరేస్తుంది! షగ్క్రీ, స్వెటర్కీ తేడా అదే! స్వెటర్ స్వెటర్లా ఉంటుంది. షగ్ర్ స్టెయిలిష్ స్వెటర్లా ఉంటుంది. ఈ వింటర్‌కి మీ ఒంటిపైకి ఓ షగ్‌న్రు తెచ్చుకోండి. అప్పుడు చలి మిమ్మల్ని కాదు... మీరే చలిని హగ్ చేసుకోవచ్చు. చలి అదరగొడుతోంది. తట్టు కునేందుకు స్వెటర్ ధరించడం మామూలే! అయితే స్వెటర్ వల్ల ఏ డ్రెస్ వేసుకున్నా ఓ స్టైల్ అంటూ ఉండదు. మరెలా? షగ్ర్ ఉంది కదా!! స్టైల్‌గా కనిపించేలా చేస్తూనే వెచ్చదనాన్ని కలిగించే ఉలెన్ షగ్ర్ ఎన్నో రంగుల్లో, డిజైన్లలో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇవి భుజాలను మాత్రమే కవర్ చేస్తూ, ఛాతి భాగంలో ఓపెన్‌గా ఉంచుతాయి. వీటిల్లో కొన్ని... బటన్సతో ఉంటాయి. అయితే ఇవి ఎవరికి నప్పుతాయి? వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కూడా తెలుసుకుంటే స్టైల్‌ని మరింత అదరగొట్టచ్చు. చలిని హాయిగా హగ్ చేసుకోవచ్చు. ర్యాంప్ స్టైల్: షగ్ర్ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. తొలినాళ్లలో నవవధువు ధరించే గౌన్ పై అందంగా చేతులకు, ఛాతీ భాగంలో డిజైన్‌గా ఒదిగిఉండేది. తర్వాత క్రమంగా ర్యాంప్‌ల మీద రకరకాల డ్రెస్‌లపై హొయలుగా స్థిరపడింది. అలా అన్ని దేశాలకూ స్టైల్‌గా వ్యాపించింది. చిన్నపాటి బ్లేజర్లా అనిపించే షగ్ర్ అన్నిరకాల మెటీరియల్లోనూ లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇవి టీనేజర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఏ కాలమైనా! పొడవుగానూ, పొట్టిగానూ ఉండే షగ్ర్ ఏ కాలమైనా ఏ ఫ్యాబ్రిక్లలోనైనా లభిస్తాయి. ఔట్‌లుక్‌ను స్టైల్‌గా మార్చుతుండటంతో యంగ్‌స్టర్స్‌కి షగ్ర్ అభిమానురాలైంది. పొడవుగా ఉండే టీనేజర్స్‌కి బాగా నప్పుతాయి. వేసుకున్న డ్రెస్ ఫిట్‌గా ఉండాలి. ఆ పైన వదులుగా ఉండే ఉలెన్ షగ్ర్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. అందుకు శరీరాకృతి కూడా ఫిట్‌గా ఉండాలి. యాక్సెసరీస్: మ్యాచింగ్ బ్యాంగిల్స్, చైన్, బ్యాగ్.. ఇలా ఇతర అలంకరణ వస్తువుల్లాగే షగ్‌న్రు ఒక యాక్సెసరీగా వాడుతున్నారు. చలికాలానికి తట్టుకునే విధంగా అయితే లెదర్, ఉలెన్ మెటీరియల్ షగ్ర్ ఎంచుకుంటే రెండు విధాలా మేలు. పాశ్చాత్యం: ఇండియన్ వేర్ కాదు కాబట్టి కట్స్ మనలా చూసుకోవాలి. ర్యాంప్ షోలను గమనిస్తే శారీస్ పైన షగ్ర్ వాడడం చూస్తుంటాం. తమ డిజైన్స్‌కి ఒక స్టేటస్ సింబల్‌గా చూపించడానికి షగ్ర్ వాడతారు. అలాగని ట్రెడిషనల్ డ్రెస్‌ల పైన షగ్ర్ నప్పదు. పూర్తి వెస్ట్రన్వేర్కు మాత్రమే షగ్ర్ మ్యాచ్ అవుతుంది. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండే యంగ్‌స్టర్స్ షగ్స్న్రు హ్యాపీగా ధరించవచ్చు. రంగులు: ముదురురంగులు, డస్టీ, శాండ్, కామిల్, మడ్... కలర్స్ చలికాలానికి బాగా నప్పుతాయి. శుభ్రత: షగ్ర్ లిక్విడ్ డిటర్జెంట్ సోప్ కలిపిన నీటిలో నానబెట్టి, చేతులతో మాత్రమే శుభ్రపరచాలి. శుభ్రం చేయడానికి బ్లీచ్, బ్రష్, వాషింగ్ మెషీన్ వంటివి ఉపయోగించకూడదు. నీరు పోవడానికి గట్టిగా పిండకూడదు. ఉలెన్ దారాలు వదులయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆరవేయకూడదు. ఐరన్ చేయకూడదు. ఫ్యాబ్రిక్, డిజైన్, నాణ్యత, బ్రాండ్స బట్టి షగ్ర్స వందల రూపాయల నుంచి వేల రూపాయల్లో ధర పలుకుతోంది. టు ఇన్ వన్ లా ఉపయోగపడే షగ్ర్ మీ వార్డరోబ్లో ఉందా! శిల్పారెడ్డి మోడల్, ఫ్యాషన్ డిజైనర్ నిర్వహణ: నిర్మలారెడ్డి -
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల పని విధానంతో పాటు వాటి రూపురేఖలు కూడా మారనున్నాయి. ఇకపై ఈ కేంద్రాలు ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా పిల్లలకు ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక) విద్యా విధానాన్ని బోధించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని ఈ కేంద్రాల్లో ఉపాధ్యాయులగా ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అధికశాతం తాగు నీరు, విద్యుత్, శౌచాలయాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోని విషయ తెల్సిందే. దీంతో పిల్లలు కూడా ఈ కేంద్రాలకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్రంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీపీఐ) ఓ సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. ఈ నివేదిక ప్రకారం... మొదట అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలన ు మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా చిన్న పిల్లలను ఆకర్షించేలా చర్యలు చేపడతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసు మధ్య గల పిల్లలను ఈ కేంద్రాల్లోని ఎల్‌కేజీలోకి చేర్చుకోనున్నారు. అదే విధంగా నాలుగు నుంచి ఐదేళ్ల వ యసు మధ్య ఉన్న పిల్లలను యూకేజీలో చేర్చుకోనున్నారు. కిండర్‌గార్డెన్, ప్రీ ప్రైమరీ విద్యా విధానంలో శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తారు. కాగా ఈ కేంద్రాల్లో విద్యనభ్యసించే పిల్లలు ఎటువంటి పుస్తకాలు, పెన్నులు తీసుకురావాల్సిన అవసరం లేదు. నిపుణులు రూపొందించిన టీచింగ్-లర్నింగ్ మెటీరియల్‌తోనే వీరికి విద్యా బోధన ఉంటుంది. దీనిని విద్యా పరిభాషలో ‘సైకోమోటార్ లర్నింగ్’ అంటారు. వీరికి యూనిఫాంలు, షూ తదితర వస్తువులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీ టీచర్లు, వారి సహయకులు పిల్లల బాగోగులను చూసుకుంటారు. కాగా రూపురేఖలు మారిన కేంద్రాలను ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలుగా పిలవనున్నారు. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలను నూతన విధానంలోకి తీర్చిదిద్దడానికి వీలుకాని చోట నూతనంగా ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలను నిర్మించడం కాని లేదా ప్రాథమిక పాఠశాలలు ఉన్న భవంతుల్లోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జిల్లాకు సగటున 200 చొప్పున రాష్ట్రం మొత్తం మీద 6,800 ‘చిన్నార చిలి-పిలి’ కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం హాసన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ‘మక్కెల-మనె’ (పిల్లల ఇళ్లు) పేరుతో దాదాపు ఇలాంటి విధానాన్నే డీపీఐ...రాష్ట్ర శిశుసంక్షేమశాఖ సహకారంతో అమలు చేస్తోంది. ‘మక్కెల మనే’ మంచి ఫలితాలను ఇస్తుండటంతో కొద్ది మార్పులతో నూతన విధానాన్ని అమల్లోకి తేనున్నారు. ఈ విషయమై డీపీఐ డెరైక్టర్ మాట్లాడుతూ... ‘ఈ విధానానికి ప్రాథమికంగా రూ.110.5 కోట్లు కాగలవని అంచనా. ఒక్కొక్క చిన్నార చిలి-పిలి కేంద్రలో 25 మంది పిల్లలు ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఈ విధానం అమల్లోకి రావడం వల్ల పిల్లల ప్రాథమిక విద్యను ఉత్సాహంగా నేర్చుకుంటారు. ప్రభుత్వం నూతన విధానంపై సానుకూలంగానే స్పందించింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నాం.’ అని పేర్కొన్నారు.