‘ఏమో నాకేం తెల్సు?’ అని భుజాలు ఎగరేయడం... ‘షగ్ర్ ర.
‘చలి బాగా ఎక్కువైంది కదండీ’ అన్నప్పుడుఎవరైనా ‘షగ్ర్ చేశారనుకోండి... ఏమిటర్థం?
ఏముందీ... వాళ్లు షగ్ర్ వేసుకుని ఉన్నారని!
షగ్ర్ వేసుకున్నమ్మకు చలి తెలిస్తే కదా. స్టెయిల్‌గా ఎన్నిసార్లయినా భుజాలు ఎగరేస్తుంది!
షగ్‌క్రీ, స్వెటర్‌కీ తేడా అదే!
స్వెటర్ స్వెటర్‌లా ఉంటుంది. షగ్ర్ స్టెయిలిష్ స్వెటర్‌లా ఉంటుంది.
ఈ వింటర్‌కి మీ ఒంటిపైకి ఓ షగ్‌న్రు తెచ్చుకోండి.
అప్పుడు చలి మిమ్మల్ని కాదు... మీరే చలిని హగ్ చేసుకోవచ్చు.
చలి అదరగొడుతోంది. తట్టు కునేందుకు స్వెటర్ ధరించడం మామూలే! అయితే స్వెటర్ వల్ల ఏ డ్రెస్ వేసుకున్నా ఓ స్టైల్ అంటూ ఉండదు. మరెలా? షగ్ర్ ఉంది కదా!!
స్టైల్‌గా కనిపించేలా చేస్తూనే వెచ్చదనాన్ని కలిగించే ఉలెన్ షగ్ర్ ఎన్నో రంగుల్లో, డిజైన్లలో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇవి భుజాలను మాత్రమే కవర్ చేస్తూ, ఛాతి భాగంలో ఓపెన్‌గా ఉంచుతాయి. వీటిల్లో కొన్ని... బటన్‌సతో ఉంటాయి. అయితే ఇవి ఎవరికి నప్పుతాయి? వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు కూడా తెలుసుకుంటే స్టైల్‌ని మరింత అదరగొట్టచ్చు. చలిని హాయిగా హగ్ చేసుకోవచ్చు.
ర్యాంప్ స్టైల్: షగ్ర్ పూర్తిగా పాశ్చాత్య తరహాకు చెందినది. తొలినాళ్లలో నవవధువు ధరించే గౌన్ పై అందంగా చేతులకు, ఛాతీ భాగంలో డిజైన్‌గా ఒదిగిఉండేది. తర్వాత క్రమంగా ర్యాంప్‌ల మీద రకరకాల డ్రెస్‌లపై హొయలుగా స్థిరపడింది. అలా అన్ని దేశాలకూ స్టైల్‌గా వ్యాపించింది. చిన్నపాటి బ్లేజర్‌లా అనిపించే షగ్ర్ అన్నిరకాల మెటీరియల్‌లోనూ లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఇవి టీనేజర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
ఏ కాలమైనా! పొడవుగానూ, పొట్టిగానూ ఉండే షగ్ర్ ఏ కాలమైనా ఏ ఫ్యాబ్రిక్‌లలోనైనా లభిస్తాయి. ఔట్‌లుక్‌ను స్టైల్‌గా మార్చుతుండటంతో యంగ్‌స్టర్స్‌కి షగ్ర్ అభిమానురాలైంది. పొడవుగా ఉండే టీనేజర్స్‌కి బాగా నప్పుతాయి. వేసుకున్న డ్రెస్ ఫిట్‌గా ఉండాలి. ఆ పైన వదులుగా ఉండే ఉలెన్ షగ్ర్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. అందుకు శరీరాకృతి కూడా ఫిట్‌గా ఉండాలి.
యాక్సెసరీస్: మ్యాచింగ్ బ్యాంగిల్స్, చైన్, బ్యాగ్.. ఇలా ఇతర అలంకరణ వస్తువుల్లాగే షగ్‌న్రు ఒక యాక్సెసరీగా వాడుతున్నారు. చలికాలానికి తట్టుకునే విధంగా అయితే లెదర్, ఉలెన్ మెటీరియల్ షగ్ర్ ఎంచుకుంటే రెండు విధాలా మేలు.
పాశ్చాత్యం: ఇండియన్ వేర్ కాదు కాబట్టి కట్స్ మనలా చూసుకోవాలి. ర్యాంప్ షోలను గమనిస్తే శారీస్ పైన షగ్ర్ వాడడం చూస్తుంటాం. తమ డిజైన్స్‌కి ఒక స్టేటస్ సింబల్‌గా చూపించడానికి షగ్ర్ వాడతారు. అలాగని ట్రెడిషనల్ డ్రెస్‌ల పైన షగ్ర్ నప్పదు. పూర్తి వెస్ట్రన్‌వేర్‌కు మాత్రమే షగ్ర్ మ్యాచ్ అవుతుంది. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండే యంగ్‌స్టర్స్ షగ్స్‌న్రు హ్యాపీగా ధరించవచ్చు.
రంగులు: ముదురురంగులు, డస్టీ, శాండ్, కామిల్, మడ్... కలర్స్ చలికాలానికి బాగా నప్పుతాయి.
శుభ్రత: షగ్ర్ లిక్విడ్ డిటర్జెంట్ సోప్ కలిపిన నీటిలో నానబెట్టి, చేతులతో మాత్రమే శుభ్రపరచాలి.
శుభ్రం చేయడానికి బ్లీచ్, బ్రష్, వాషింగ్ మెషీన్ వంటివి ఉపయోగించకూడదు.
నీరు పోవడానికి గట్టిగా పిండకూడదు. ఉలెన్ దారాలు వదులయ్యే అవకాశం ఉంది. అలాగే ఎండలో ఆరవేయకూడదు.
ఐరన్ చేయకూడదు.
ఫ్యాబ్రిక్, డిజైన్, నాణ్యత, బ్రాండ్‌స బట్టి షగ్ర్‌స వందల రూపాయల నుంచి వేల రూపాయల్లో ధర పలుకుతోంది. టు ఇన్ వన్ లా ఉపయోగపడే షగ్ర్ మీ వార్‌డరోబ్‌లో ఉందా!
శిల్పారెడ్డి
మోడల్, ఫ్యాషన్ డిజైనర్
నిర్వహణ: నిర్మలారెడ్డి