ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్‌లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్‌ర్‌కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు.
मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu
— Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023
దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్‌లో అరుదైన గౌరవం
Comments
Please login to add a commentAdd a comment