తీర్థయాత్రలకని చెప్పి తీరని లోకాలకు | Four of family found dead in Thane | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకని చెప్పి తీరని లోకాలకు

Published Mon, Feb 1 2016 1:17 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

Four of family found dead in Thane

ముంబై: ఆర్థిక సమస్యల కారణంగా  కుటుంబంలోని నలుగురు సభ్యులు విగజీవులుగా మారడం  విషాదాన్ని నింపింది.  కళ్యాణ్ తాలూకాలోని వారి నివాసంలో  రంజిత్ యశ్వంతరావు(45)  భార్య స్వాతి(38), పిల్లలు,శ్రద్ధ, (14)  ఆర్య (7) మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   వారుంటున్న ఇంటినుంచి దుర్వాసన రావడంతో  చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు  చూసింది.

భార్య పిల్లల్ని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం యశ్వంత్ ఉరివేసుకుని చనిపోయాడు ప్రాథమిక  విచారణ అనంతరం పోలీసులు వెల్లడించారు.
ఓ ప్రయివేటు సంస్థలో క్లర్క్గా పనిచేసే యశ్వంత్ ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి  ఉంటాడని  అనుమానిస్తున్నారు.  అలాగే   మూడు రోజులు ఇంట్లో ఉండమని, తీర్థయాత్రలకు వెళుతున్నామని  బంధువులతో చెప్పిమరీ ఈ అఘాయిత్యానికి పాల్పడారన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement