గాలింపు చర్యలు ముమ్మరం | dead bodies not found | Sakshi
Sakshi News home page

గాలింపు చర్యలు ముమ్మరం

Published Fri, Apr 7 2017 11:30 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

గాలింపు చర్యలు ముమ్మరం - Sakshi

గాలింపు చర్యలు ముమ్మరం

లభ్యంకాని యువకుల మృత దేహాలు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోంమంత్రి రాజప్ప
కాకినాడ రూరల్‌ :  సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకుల జాడ శుక్రవారం రాత్రికి కూడా దొరకలేదు. తాళ్లరేవు మండలం కాపులపాలెం గ్రామానికి చెందిన పితాని గోవిందు కుటుంబ సభ్యులు గురువారం సముద్రంలో ముగ్గురు చనిపోగా, మరో ఇద్దరు యువకులు గల్లంతైన విషయం విదితమే. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఇ¯ŒSస్పెక్టర్‌ చెల్లే ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో గాలింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. 26 మంది గజ ఈతగాళ్ల, మరో 20 మంది మత్స్యకారులతో పెద్ద వల వేసి గాలిస్తున్నారు. తహసీల్దార్‌ జె.సింహాద్రి సముద్రపు ఒడ్డునే ఉండి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం 
హోం మంత్రి
కాకినాడ క్రైం :  కాండ్రకోట నూకాలమ్మవారి దర్శనం అనంతరం కాకినాడ బీచ్‌కి వెళ్లి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన కలెక్టర్‌ ఆరుణ్‌కుమార్‌తో కలిసి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం పరామర్శించారు. మృతి చెందిన పెద్దలకు రూ. 3 లక్షలు, చిన్నారులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. బీచ్‌లో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయించాలి్సందిగా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. కాకినాడ సముద్ర తీరం ఆనుకుని బీచ్‌లో డ్రెడ్జింగ్, పోర్టు కార్యకలాపాలు అధికంగా జరగడంతో సముద్రం లోపల కరెంట్‌ అధికంగా ఉంటుందని, దీంతో అసాధారణ రీతిలో ఉవ్వెత్తున కెరటాలు ఎగసి పడుతాయని రాజప్ప చెప్పారు. తీరంలో రక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పర్యాటకులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శీలం శ్రీను, పితాని రమ్య, శీలం తనుకులమ్మను ఆయన పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధీర్‌ను ఆదేశించారు. బంధువులను ఓదార్చారు. బాధితులను పరామర్శించిన వారిలో శాసన మండలి ఉపాధక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుతో పాటూ పలువురు నేతలు ఉన్నారు.  
రాకాసి  కెరటాలకు బలయ్యారు
అప్పటి వరకూ అందరం ఆనందంగా గడిపాం. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాం. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. ఒకసారి బీచ్‌కెళదాం నాన్నా అని నా కూతురు అనిత కోరింది. తర్వాత అందరూ వెళదామన్నారు. సరేనన్నాను. అంతా కలసి బీచ్‌కెళ్లాం. అందరూ ఆటోల నుంచి కిందకి దిగి గుంపులుగా బీచ్‌లో కెళి్లపోయారు. నేను ఆటో దిగి బీచ్‌కొస్తుంటే, ఒక్కసారిగా సముద్రం నుంచి హాహాకారాలు వినిపించాయి, గల్లంతవ్వడం, స్థానికులు సముద్రంలోకెళ్లి రక్షించడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ దుర్ఘటనలో నా కుమార్తె అనితతో పాటూ నా తమ్ముడు పితాని శ్రీను, సోదరి పిల్లలు శీలం దేవి మృతి చెందారు. సముద్రంలో గల్లంతైన వారిలో నా కుమారుడు వీరవంశీ, జయకృష్ణ ఉన్నారు. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కళ్లెదుటే నా కుటుంబ సభ్యులను పోగోట్టుకున్నాను.         
– పితాని గోవిందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement