విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రోజురోజుకూ డెంగ్యూ జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది.
విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో రోజురోజుకూ డెంగ్యూ జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది. పట్టణంలోని 24వ వార్డు బుగత వీధికి చెందిన హనుమంతు అప్పలనరసమ్మ(50), 25వ వార్డు బొగ్గులవీధికి చెందిన సౌజన్య(12)కు డెంగ్యూ జ్వరం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు బాధితులను బుధవారం సాయంత్రం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.