అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది | Missing Class 12 Student's Body Found In Lucknow Sewer | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది

Published Mon, Feb 15 2016 2:47 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

అదృశ్యమైన విద్యార్థిని  శవమై తేలింది - Sakshi

అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది

లక్నో: అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని శవమై తేలింది. ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఉన్నతి విశ్వకర్మ మృతదేహాన్ని పోలీసులు  కనుగొన్నారు.  దీంతో తమ కూతురి ఆచూకీ కోసం గత వారం రోజులుగా ఆశతో ఎదురుచూస్తున్న ఆమె  కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

సెవార్ లోని రాణీ లక్ష్మీబాయి కాలేజీలో చదువుతున్న ఉన్నతి మొబైల్ను ఒక రిక్షా డ్రైవర్ దగ్గర గుర్తించారు. అయితే తనకు ఆ మొబైల్ దొరికిందని అతను చెబుతున్న చోటే అమ్మాయి చనిపోయి ఉండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. చెట్టుకు  వేలాడుతూ ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి రాజేష్ పాండే తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని,  పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత  పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement