అవయవాల కోసమే చంపేశారా? | Body of missing boy found in UP Bhadohi, | Sakshi
Sakshi News home page

అవయవాల కోసమే చంపేశారా?

Published Fri, Jul 3 2015 3:25 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Body of missing boy found in UP Bhadohi,

లక్నో: ఉత్తరప్రదేశ్లోని బదోహిలో కనిపించకుండా పోయిన పదేళ్ల బాలుడు శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. గురువారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన అర్జునకుమార్ సరోజ్ మృతదేహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇంటికి సమీపంలో పడేసి వెళ్లి పోయారు.  దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు అతని మృతదేహంలో కొన్ని అవయవాలు  మిస్ అయినట్టుగా గుర్తించారు. 

 

దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే పోస్ట్ మార్టమ్ నివేదిక అందిన తర్వాత కానీ పూర్తి వివరాలు  తెలియవని పోలీసులు అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో  దర్యాప్తు చేస్తామని  తెలిపారు. కాగా మృతుని ఇంటికి  సుమారు 200 మీటర్ల దూరంలో చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నట్టు  తెలుస్తోంది. వాళ్లలో ఎవరో ఒకరు అతడి అవయవాల కోసమే చంపేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement