ఫోటోగ్రాఫర్ ట ర్న్డ్ పెర్ఫ్యూమ్ రీసెర్చర్ మోనికా గూర్డె (39)దారుణ హత్యకు గురయింది. హై ప్రొఫైల్ పెర్ ఫ్యూమర్ , ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ గా పేరొందిన మోనికా .. గోవాలోని సంగోల్డాలో ఉన్న ఫ్లాట్ లో అనుమానాస్పదరీతిలో శవమై తేలారు. చేతులు కట్టేసి, బెడ్ పై నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గోవా డీఐజీ విమల్ గుప్త అందించిన సమాచారం ప్రకారం గురువారం ఉదయం పనిమనిషి వచ్చినపుడు మెనికా తలుపు తీయలేదు. దీంతో పొరుగువారికి ముంబైలో ఉంటున్న ఆమె అన్న ఆనంద్ కు సమాచారం అందించింది. అన్న ఫోన్ కాల్స్ కు మోనికా స్పందించలేదు. వెంటనే ఆనంద్ , మెనికా మాజీ భర్త ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ను భరత్ రామామృతాన్ని సంప్రదించారు. అయినా ఫలితంలేదు. చివరికి పొరుగున నివసించే అమరికన్ మహిళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ సహాయంతో తలుపు తీయడంతో విషయం వెలుగు చూసింది.