perfumer
-
పరిమళం తగ్గుతోంది!
ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ గర్లింగ్ చెబుతున్నారు. డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ‘న్యూ సైంటిస్ట్’ జర్నల్‌లో ప్రచురించారు. -
ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ దారుణ హత్య
-
ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ దారుణ హత్య
పనాజి: ఫోటోగ్రాఫర్ ట ర్న్డ్ పెర్ఫ్యూమ్ రీసెర్చర్ మోనికా గూర్డె (39)దారుణ హత్యకు గురయింది. హై ప్రొఫైల్ పెర్ ఫ్యూమర్ , ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ గా పేరొందిన మోనికా .. గోవాలోని సంగోల్డాలో ఉన్న ఫ్లాట్ లో అనుమానాస్పదరీతిలో శవమై తేలారు. చేతులు కట్టేసి, బెడ్ పై నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గోవా డీఐజీ విమల్ గుప్త అందించిన సమాచారం ప్రకారం గురువారం ఉదయం పనిమనిషి వచ్చినపుడు మెనికా తలుపు తీయలేదు. దీంతో పొరుగువారికి ముంబైలో ఉంటున్న ఆమె అన్న ఆనంద్ కు సమాచారం అందించింది. అన్న ఫోన్ కాల్స్ కు మోనికా స్పందించలేదు. వెంటనే ఆనంద్ , మెనికా మాజీ భర్త ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ను భరత్ రామామృతాన్ని సంప్రదించారు. అయినా ఫలితంలేదు. చివరికి పొరుగున నివసించే అమరికన్ మహిళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ సహాయంతో తలుపు తీయడంతో విషయం వెలుగు చూసింది. ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని తెలిసినవారి పనే అయి వుంటుందని తమ ప్రాథమిక విచారణ అంచనా అని డీఐజీ చెప్పారు. శరీరంపై ఎటువంటి పొడిచిన గాయాలు లేవని, ఆమె ముఖం మీద ఎరుపు మార్కులు ఉన్నాయని తెలిపారు. దిండుతో అదిమి పెట్టి హత్య చేసిఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా నాగ్‌పూర్ చెందిన మోనికా ముంబైకోర్టు మాజీ జడ్జి రమేష్ గూర్డె కూతురు. ముంబై జేజే ఇన్ట్సిట్యూట్ నుంచి ఫోటగ్రఫీ కోర్స్ చేసిన మోనికా .. జీన్ ఫ్రాంకోసిస్, క్రిస్టియన్ లాబోటిన్ ఆనంద్ కాబ్రా లాంటి ప్రముఖ డిజైనర్స్ తో కలిసి పనిచేశారు. ఈనేపథ్యంలో మో ల్యాబ్ అనే ఫెర్ ఫ్యూం కంపెనీని కూడా స్థాపించారు. కొంతకాలం చెన్నై లో నివసించిన అనంతరం గోవాకు మకాం మార్చారు. గత ఏడాది భర్తతో విడిపోయిన మోనికా గోవాలో ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మెనికా ఒక వీడియో ను కూడా రిలీజ్ చేశారు.