ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ దారుణ హత్య
పనాజి: ఫోటోగ్రాఫర్ ట ర్న్డ్ పెర్ఫ్యూమ్ రీసెర్చర్ మోనికా గూర్డె (39)దారుణ హత్యకు గురయింది. హై ప్రొఫైల్ పెర్ ఫ్యూమర్ , ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్ గా పేరొందిన మోనికా .. గోవాలోని సంగోల్డాలో ఉన్న ఫ్లాట్ లో అనుమానాస్పదరీతిలో శవమై తేలారు. చేతులు కట్టేసి, బెడ్ పై నగ్నంగా పడివున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
గోవా డీఐజీ విమల్ గుప్త అందించిన సమాచారం ప్రకారం గురువారం ఉదయం పనిమనిషి వచ్చినపుడు మెనికా తలుపు తీయలేదు. దీంతో పొరుగువారికి ముంబైలో ఉంటున్న ఆమె అన్న ఆనంద్ కు సమాచారం అందించింది. అన్న ఫోన్ కాల్స్ కు మోనికా స్పందించలేదు. వెంటనే ఆనంద్ , మెనికా మాజీ భర్త ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ను భరత్ రామామృతాన్ని సంప్రదించారు. అయినా ఫలితంలేదు. చివరికి పొరుగున నివసించే అమరికన్ మహిళ దగ్గర ఉన్న డూప్లికేట్ కీ సహాయంతో తలుపు తీయడంతో విషయం వెలుగు చూసింది. ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని తెలిసినవారి పనే అయి వుంటుందని తమ ప్రాథమిక విచారణ అంచనా అని డీఐజీ చెప్పారు.
శరీరంపై ఎటువంటి పొడిచిన గాయాలు లేవని, ఆమె ముఖం మీద ఎరుపు మార్కులు ఉన్నాయని తెలిపారు. దిండుతో అదిమి పెట్టి హత్య చేసిఉంటారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, లైంగిక దాడి చేసి హత్య చేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా నాగ్పూర్ చెందిన మోనికా ముంబైకోర్టు మాజీ జడ్జి రమేష్ గూర్డె కూతురు. ముంబై జేజే ఇన్ట్సిట్యూట్ నుంచి ఫోటగ్రఫీ కోర్స్ చేసిన మోనికా .. జీన్ ఫ్రాంకోసిస్, క్రిస్టియన్ లాబోటిన్ ఆనంద్ కాబ్రా లాంటి ప్రముఖ డిజైనర్స్ తో కలిసి పనిచేశారు. ఈనేపథ్యంలో మో ల్యాబ్ అనే ఫెర్ ఫ్యూం కంపెనీని కూడా స్థాపించారు. కొంతకాలం చెన్నై లో నివసించిన అనంతరం గోవాకు మకాం మార్చారు. గత ఏడాది భర్తతో విడిపోయిన మోనికా గోవాలో ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మెనికా ఒక వీడియో ను కూడా రిలీజ్ చేశారు.