
చిన్నారి మృతదేహం
కావలి రూరల్: ఆడ పిల్ల భారమైందా? అనైతిక సుఖం పాపానికి రూపమై అడ్డంగా మారిందా? ఏమైందో తెలియదు కానీ.. ముక్కు పచ్చలారని మూడు నెలల పసిబిడ్డ నిర్జీవమై చెరువు నీటిలో తేలియాడింది. ఈ ఘటన మండలంలోని ఆముదాలదిన్నె సమీపంలో తాళ్లపాళెం చెరువులో ఆదివారం ఈ ఘటన వెలుగుచూసింది. కావలి రూరల్ పోలీసుల సమాచారం మేరకు.. తాళ్లపాళెం చెరువు నీటిలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం ఉన్నట్లు ఆముదాలదిన్నె వీఆర్‌ఓ సమాచారం అందించడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. 3 నెలల చిన్నారి పాపగా గురించారు. చిన్నారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment