రిమ్మనపూడి (పామర్రు): ‘వెచ్చని నీ పొత్తిళ్లలో ఉండాల్సిన నేను ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా.. చలి గాలులకు నా చిట్టి ప్రాణం తట్టుకోలేక పోతోందమ్మా.. వీధి కుక్కలు ఎక్కడ వచ్చి పీక్కు తింటాయోనని భయంగా ఉందమ్మా.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తున్నా నీకు వినిపించడం లేదా అమ్మా.. ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోతోందమ్మా.. పొదల్లో నన్ను ఎవరెవరో వచ్చి చూస్తున్నారు కానీ నీవు రావడంలేదు ఏమిటమ్మా..’ అన్నట్టుంది ఆ పసిగుడ్డు పరిస్థితి.
పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకామ్మగుంట గ్రామం శివారులో చెట్ల పొదల నుంచి చంటిపాప ఏడుపు విన్న స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్‌ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment