bushes
-
అడవిలో తప్పిపోయిన బాలుడ్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు
-
చిట్టడివి..చీకటి.. ఓ చిన్నారి కథ
పోరుమామిళ్ల: ఏడేళ్ల బాలుడు ఇంటికి బయలుదేరాడు. ఊరు దారి విడిచి అడవి దారి పట్టాడు. చిట్టడవిలో చిక్కుకుపోయాడు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లార్లు గడిపాడు. బిడ్డ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రంతా అడవిలో వెతుకులాడినా ఫలితం లేదు. తెల్లవారిన తర్వాత తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంట పడ్డాడు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 గంటల గ్రామస్తుల ఉత్కంఠకు తెరదించాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలంలో కవలకుంట్ల పంచాయతీలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... కవలకుంట్ల పంచాయతీ బుచ్చంపల్లెకు చెందిన మతకాల వెంకటసుబ్బయ్య, సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుమంత్(7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య గేదెలు మేపుకుంటూ, సీతామహాలక్ష్మి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన సుమంత్ తల్లి కట్టెపుల్లలకు వెళుతుంటే తనూ వెళ్లాడు. సమీపంలో అడవికి దగ్గరలో తండ్రి గేదెలు మేపుతుండగా అమ్మతో చెప్పి నాన్న దగ్గరకు వెళ్లాడు. చీకటి పడుతుందని, నీవు ఈ దారిలో ఇంటికి వెళ్లు అని వెంకటసుబ్బయ్య కొడుక్కు చెప్పి..తాను చెట్లు, పొదల్లో మేస్తున్న గొడ్లను తోలుకొస్తానని దారి చూపించి వెళ్లాడు. బుడ్డోడు సరేనని నాన్న చూపించిన దారిలో బయలుదేరాడు. పొరపాటున కొండదారి పట్టాడు. అలా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లేసరికి బాగా చీకటిపడింది. కనుచూపు మేరలో ఊరు కనిపించలేదు. కేకలు వేసినా పలికే దిక్కు లేదు. బిక్కు బిక్కు మంటూ అలాగే ఓ పొద దగ్గర కూలబడిపోయాడు. చీకటి పడ్డా బిడ్డ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కనపడిన వారందరినీ అడిగారు. ఆచూకీ లభించలేదు. విషయం ఊరంతా పాకిపోయింది. ఓ యాభై మంది పిల్లాడిని వెతికేందుకు అడవికి బయలుదేరారు. పోలీసులు, ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందడంతో వారూ వెతకడానికి వెళ్లారు. తెల్లారేంతవరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు. పశువుల కోసం వెతుకుతుండగా... ఈ నేపథ్యంలో బుధవారం పొద్దుపొడవక ముందే కవలకుంట్లకు చెందిన ఏసయ్య, శాంతయ్యలు తప్పిపోయిన తమ గొడ్లను వెతికేందుకు అడవి దారి పట్టారు. అలా వారు వెళుతుండగా ఆరు గంటల ప్రాంతంలో పొద దగ్గర బాలుడి ఏడుపు విని అటు వెళ్లడంతో సుమంత్ కనిపించాడు. విచారిస్తే విషయం అర్థమయింది. బాలుడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఊరి దారి పట్టారు. దారిలో ఉండగానే ఫారెస్టు సిబ్బంది, గ్రామస్తులు ఎదురయ్యారు. సుమంత్‌ను చూసి ఫారెస్టు సిబ్బంది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 14 గంటలు ఎంతో టెన్షన్ పెట్టినా చివరాఖరుకు కథ సుఖాంతమయింది. -
ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా..?
రిమ్మనపూడి (పామర్రు): ‘వెచ్చని నీ పొత్తిళ్లలో ఉండాల్సిన నేను ఇలా పొదల్లోకి వచ్చిపడ్డాను ఏమిటమ్మా.. చలి గాలులకు నా చిట్టి ప్రాణం తట్టుకోలేక పోతోందమ్మా.. వీధి కుక్కలు ఎక్కడ వచ్చి పీక్కు తింటాయోనని భయంగా ఉందమ్మా.. ఆకలేసి గుక్కపెట్టి ఏడుస్తున్నా నీకు వినిపించడం లేదా అమ్మా.. ఏడ్చీ ఏడ్చీ గొంతు తడారిపోతోందమ్మా.. పొదల్లో నన్ను ఎవరెవరో వచ్చి చూస్తున్నారు కానీ నీవు రావడంలేదు ఏమిటమ్మా..’ అన్నట్టుంది ఆ పసిగుడ్డు పరిస్థితి. పామర్రు మండలం రిమ్మనపూడి శివారు అంకామ్మగుంట గ్రామం శివారులో చెట్ల పొదల నుంచి చంటిపాప ఏడుపు విన్న స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ముళ్లపొదల నుంచి ఏడుపులు.. అసలేం జరిగింది..?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తొమ్మిది నెలలు మోసి, పాలిచ్చి పెంచిన తల్లి..కుమారులకు భారమైంది. రెండు కాళ్లు కదపలేక వృద్ధాప్యంతో బాధపడుతున్న తల్లిపై ఏ మాత్రం కనికరం చూపకుండా ముళ్లపొదల్లో పారవేసి వదిలించుకున్నారు. మనసున్న కొందరు మహిళలు ఆ మార్గంలో వెళుతూ గమనించి ఆదుకోగా ప్రభుత్వ ఆస్పత్రిలో అనాథలా గడుపుతోంది. వివరాలు.. తిరుళ్లూరు జిల్లా పొన్నేరి సమీపం కున్నమంజేరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు సమీపంలోని చెరువుకు వెళుతుండగా మార్గమధ్యంలోని ముళ్లపొదల నుంచి మహిళ ఏడుపులు, మూలుగుల శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా రెండు కాళ్లు అచేతన స్థితిలో సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు పడిఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారంతా కలిసి వృద్ధురాలిని ముళ్లపొదల్లో నుంచి మోసుకొచ్చి పోలీసుల సమాచారం ఇచ్చారు. ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనలి చెక్కోడుకు చెందిన ఆ వృద్ధమహిళ కాంతిమతి పోలీసులకు తనగోడు చెప్పుకున్నారు. తనకు భర్త రాధాకృష్ణన్, రవి, శంకర్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుమారులిద్దరూ కూలీపనులకు వెళుతుంటారు. కుమారులు తనను సరిగా చూసుకునేవారు కాదు. తనను పోషించడం భారంగా భావించారు. చిన్నకుమారుడు శంకర్ మాయమాటలతో గురువారం రాత్రి మోటార్‌సైకిల్‌పై తీసుకొచ్చి జనసంచారం లేని ప్రాంతంలోని ముళ్లపొదల్లో తోసివేసి వెళ్లిపోయాడని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. వృద్ధురాలు కాంతిమతి కుటుంబం గురించి మరిన్ని వివరాలు చెప్పలేకపోవడంతో సమాచారం రాబట్టేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. పూర్తి సమాచారం రాబట్టిన తరువాత కుమారులపై ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయిస్తామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. మనసు మార్చుకుని కుమారులు వస్తారు, అక్కున చేర్చుకుంటారని ఆ అమాయక తల్లి ఆశగా ఎదురుచూస్తోంది. చదవండి: దోషం పోతుందని బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు దారుణం: ప్రియుడి కామవాంఛకు ఐదేళ్ల కుమార్తె బలి -
శిశువును పొదలో పడేసేందుకు యత్నం
సాక్షి, డోన్(కర్నూలు): పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. రెండు నెలల పసిగుడ్డు.. అనారోగ్యంతో మృతిచెందితే.. మానవత్వం మరిచి ముళ్లపొదల్లో పారవేసిన తల్లిదండ్రుల ఉదంతం ఇది. బనగానపల్లె మండలం లింగదొడ్డి గ్రామానికి చెందిన రాజు,లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుతూరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. దీంతో వారు నేరుగా మృత శిశువును రైలులో డోన్‌కు తీసుకొచ్చి పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో ముళ్లపొదల్లో పడవేశారు. దీన్ని గమనించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐలు సురేష్, నరేష్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి మృత శిశువును ఖననం చేస్తామనే హామీతో వదిలివేశారు. -
తండ్రి గాఢ నిద్రలో ఉండగా.. పాక్కుంటూ వెళ్లి..
రాంబిల్లి(యలమంచిలి): తెల్లవారు 3 గంటల సమయం.. ముళ్ల పొదల్లోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు గమనించిన స్థానికుడు 100 కు ఫోన్ చేశాడు. రంగంలోకి రాంబిల్లి పోలీసులు దిగా రు. ముళ్లపొదల్లో ఏడుస్తున్న బాలుడిని బయ టకు తీశారు. బాలుడు సురక్షితం. వెంటనే బాలుడికి పాలు, ఆహారం అందించిన ఎస్ఐ వి. అరుణ్‌కిరణ్ విచారణ ప్రారంభించారు. బాలు డు ఎవరని చుట్టుపక్కల ఆరా తీశారు. ఈ బాలుడు తండ్రి సుమారు 30 మీటర్ల దూరంలో గాఢ నిద్రలో పడుకొని వున్నాడు. తండ్రి పేరు దుంగా రాజు. ఇతనిది యలమంచిలి. కొండవారపాలెంలో కొబ్బరికాయలు తీస్తుంటాడు. అయితే గురువారం రాత్రి ఇతని కుమారుడు రెండేళ్ల దుంగా ఉదయ్‌ప్రకాష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని యలమంచిలిలో తన భార్యతో కలిపి జరుపుకొన్నాడు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే తనతో పాటు కొడుకును కొండవారపాలెం తీసుకువచ్చాడు. గాఢ నిద్రలోకి జారుకోవడంతో బాలుడు తుప్పల్లోకి పాకుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత పోలీసుల రావడం , సురక్షితంగా బాలుడు బయటపడడం ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగిపోయాయి. -
నీటిపై పెరటి తోటలు
బియ్యం మొదలుకొని ఉప్పు పప్పు అన్నింటి ధరలు ఇప్పటికే మండిపోతున్నాయి. ఇంకొన్నేళ్లు పోతే ప్రపంచ జనాభా ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకుంటుంది. అప్పుడు గంపల్లో డబ్బు మోసుకెళ్లి సంచుల్లో కాయగూరలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. మరి ఏమిటి తరుణోపాయం? భూమ్మీద 70 శాతం వరకూ ఉన్న సముద్రాలను వాడుకోవడమే అంటోంది స్పెయిన్‌లోని ఫార్వార్డ్ థింకింగ్ ఆర్కిటెక్చర్ సంస్థ. అదెలా? సముద్రంలో జలచరాలు మినహా మరేవీ పండవు కదా అంటున్నారా? నిజమేగానీ.. నీటిపై ఫొటోలో చూపినట్టు భారీసైజులో తేలియాడే కట్టడాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాల పంటలూ పండించుకోవచ్చునని అంటోంది ఈ సంస్థ. ‘స్మార్ట్ ఫ్లోటింగ్ ఫార్మ్’ అని పిలిచే ఈ తేలియాడే కట్టడాలు మూడు అంతస్తులుగా విడిపోయి ఉంటాయి. పైకప్పు మొత్తం సోలార్ ప్యానెల్స్‌తో నిండి ఉంటుంది. దీంతోపాటు వాననీటిని ఒడిసిపట్టేందుకు, అవసరమైనప్పుడు కాంతిని ప్రసారం చేసేందుకూ ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇక రెండో అంతస్తుకు దిగివస్తే.. ఇక్కడ నేల అవసరమన్నది లేకుండా హైడ్రోపానిక్స్ పద్ధతిలో పంటలు పండించే గ్రీన్‌హౌస్‌లు ఉంటాయి. ఇక మిగిలిన ఒక అంతస్తులో చేపలు, ఇతర సముద్రజీవులను కృత్రిమ కొలనుల్లో పెంచుతారు. చేపల వ్యర్థాలు, ఇతర పోషకాలను పంటలకు ఎరువుగా ఉపయోగించేందుకు అవకాశముంటుంది. ఒక్కో స్మార్ట్ ఫ్లోటింగ్ ఫార్మ్ ద్వారా ఏడాదికి దాదాపు 8 వేల టన్నుల కాయగూరలు, 1,703 టన్నుల మత్స్య ఉత్పత్తులు సాగుచేయవచ్చునని, అవసరాన్ని బట్టి ఫార్మ్ సైజును పెంచుకునే అవకాశం ఉండటం వల్ల ఆహార కొరతన్నది రాదని అంచనా. ముంబై, న్యూయార్క్, లాస్ఏంజెలిస్, టోక్యో, జకార్తా వంటి సముద్రతీర మహా నగరాల్లో ఇలాంటి ఫార్మ్లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం వల్ల తక్కువ ధరకే (పల్లె నుంచి, ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులు తగ్గి) కాయగూరలు, పండ్లూ లభిస్తాయి. ఐడియా బాగానే ఉందిగానీ.. ఒక్కో ఫార్మ్ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది? పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై కంపెనీ వేస్తున్న లెక్కలు పూర్తవడానికి ఇంకొంచెం టైమ్ పట్టేలా ఉంది. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ముళ్లపొదల నుంచి స్పెయిన్ దేశానికి...!
– శిశుగృహ చిన్నారిని దత్తత తీసుకున్న స్పెయిన్ దంపతులు – ఆర్జేడీ సమక్షంలో దంపతులకు అప్పగింత కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రి ముళ్లపొదల్లో రక్తమడుగులో లభించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారి ఇక బతకదని భావించారు. పెద్దాసుపత్రి వైద్యుల పుణ్యమా అని ఆ చిన్నారి మళ్లీ ఈ లోకాన్ని చూసింది. శిశుగృహలో పెద్దగై ఆరేళ్ల వయస్సులో ఇప్పుడు స్పెయిన్ దేశానికి చెందిన దంపతుల ముద్దుల కూతురు కాబోతోంది. ఎక్కడ పుట్టిందో తెలియకపోయినా స్పెయిన్ దేశంలో పెరిగి పెద్దకాబోతోంది చిన్నారి లలిత. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగం సమీపంలో ముళ్లపొదల్లో మూడేళ్ల క్రితం మూడున్నరేళ్ల ఆడపిల్ల పడి ఉంది. ఒళ్లంతా గాయాలు, ముఖమంతా ఉబ్బిపోయి చావుకు దగ్గరలో ఆ చిన్నారిని కన్న వారు కొట్టిపారేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నపిల్లల విభాగంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఎంతో కష్టించి వైద్యులు పాపకు మెరుగైన వైద్యంతో బాగు చేశారు. అనంతరం పాపను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌కు తరలించి వసతి కల్పించారు. అక్కడ పాపకు లలిత అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అక్కడి ఆయాలే పాపకు అమ్మానాన్న. మూడేళ్ల పాటు వారి సంరక్షణలోనే లలిత పెరిగి పెద్దయ్యింది. స్పెయిన్ దేశ దంపతుల దత్తత శిశుగృహలోని చిన్నారుల ఫొటోలను దత్తత ఇచ్చేందుకు అధికారులు ఆన్లైన్లోని ప్రత్యేక వెబ్సైట్లో పెడుతుంటారు. ఈ క్రమంలో స్పెయిన్ దేశంలోని కిడాడ్రేర్ ప్రాంతానికి చెందిన జీసస్ డెమోగన్ మార్కజ్, మరియాథెరిసా డీ జీసస్ ఆరగాన్ పిరేజ్ దంపతులు పిల్లలను దత్తత తీసుకునేందుకు అన్వేషిస్తున్నారు. వారికి పెళ్లై 20 ఏళ్లయినా సంతానం కలుగలేదు. దీనికి తోడు వారి దేశంలో ఎవరినైనా పిల్లలను దత్తత తీసుకుందామంటే చాలా మంది సంతానలేమితో బాధపడుతున్న వారే అధికం. దీంతో ఇతర దేశాల్లో పిల్లలను ఆన్లైన్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శిశుగృహలోని చిన్నారుల ఫొటోలు వారి కంట పడ్డాయి. అందులోంచి లలితను ఎంచుకున్నారు. ఈ మేరకు మన దేశం వచ్చి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శారద, శిశు గృహ మేనేజర్ సమక్షంలో చిన్నారి లలితను స్పెయిన్ దంపతులకు అప్పగించారు. జిల్లా జడ్జి సమక్షంలో మరిన్ని ఆధారాలు చూపించిన అనంతరం వారం రోజుల్లో స్పెయిన్ దేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి జన్మించిందో.. ఎక్కడ పుట్టిందో తెలియని చిన్నారి.. ఇప్పుడు స్పెయిన్ దేశానికి వెళ్తుండటంతో శిశుగృహతో పాటు స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సూర్యాపేటలో దారుణం
సూర్యాపేట: సూర్యాపేటలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువునువదిలి వెళ్లారు. కట్ట పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడి ఉన్న పసికందును ఎలుకలు తినడంతో.. శిశువు మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
పొదల్లో గుర్తుతెలియని మృతదేహం
ఎచ్చర్ల (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలకేంద్రంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జాతీయరహదారిపై తమ్మినీడుపేట సమీపంలోని టోల్గేట్ వద్ద పొదల్లో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ భార్గవప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించి, మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. -
ముళ్ల కంపల్లో పసిపాప
పెద్ద దోర్నాల (ప్రకాశం జిల్లా) : రోజుల వయసున్న ఆడ శిశువును అమానుషంగా కంప చెట్లలో వదిలేసి వెళ్లారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని వంతనె సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. ముళ్లు గుచ్చుకుని పసిపాప ఏడవడంతో స్థానికులు చూసి పాలు పట్టించి ఎస్ఐ నాగరాజుకు విషయం తెలియజేశారు. ఆయన వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మొత్తానికి స్థానికుల చొరవతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది.