
మృత శిశువును తల్లిదండ్రులకు అప్పగించిన దృశ్యం
సాక్షి, డోన్(కర్నూలు): పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. రెండు నెలల పసిగుడ్డు.. అనారోగ్యంతో మృతిచెందితే.. మానవత్వం మరిచి ముళ్లపొదల్లో పారవేసిన తల్లిదండ్రుల ఉదంతం ఇది. బనగానపల్లె మండలం లింగదొడ్డి గ్రామానికి చెందిన రాజు,లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుతూరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. దీంతో వారు నేరుగా మృత శిశువును రైలులో డోన్‌కు తీసుకొచ్చి పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో ముళ్లపొదల్లో పడవేశారు. దీన్ని గమనించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐలు సురేష్, నరేష్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి మృత శిశువును ఖననం చేస్తామనే హామీతో వదిలివేశారు.
Comments
Please login to add a commentAdd a comment