బాలుడు ఉదయ్‌ప్రకాష్‌ను తండ్రి రాజుకు అప్పగించిన పోలీసులు
రాంబిల్లి(యలమంచిలి): తెల్లవారు 3 గంటల సమయం.. ముళ్ల పొదల్లోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు గమనించిన స్థానికుడు 100 కు ఫోన్ చేశాడు. రంగంలోకి రాంబిల్లి పోలీసులు దిగా రు. ముళ్లపొదల్లో ఏడుస్తున్న బాలుడిని బయ టకు తీశారు. బాలుడు సురక్షితం. వెంటనే బాలుడికి పాలు, ఆహారం అందించిన ఎస్‌ఐ వి. అరుణ్‌కిరణ్ విచారణ ప్రారంభించారు. బాలు డు ఎవరని చుట్టుపక్కల ఆరా తీశారు. ఈ బాలుడు తండ్రి సుమారు 30 మీటర్ల దూరంలో గాఢ నిద్రలో పడుకొని వున్నాడు. తండ్రి పేరు దుంగా రాజు. ఇతనిది యలమంచిలి. కొండవారపాలెంలో కొబ్బరికాయలు తీస్తుంటాడు. అయితే గురువారం రాత్రి ఇతని కుమారుడు రెండేళ్ల దుంగా ఉదయ్‌ప్రకాష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని యలమంచిలిలో తన భార్యతో కలిపి జరుపుకొన్నాడు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే తనతో పాటు కొడుకును కొండవారపాలెం తీసుకువచ్చాడు. గాఢ నిద్రలోకి జారుకోవడంతో బాలుడు తుప్పల్లోకి పాకుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత పోలీసుల రావడం , సురక్షితంగా బాలుడు బయటపడడం ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment