అయిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య | 5-year-old raped, later strangulated to death | Sakshi
Sakshi News home page

అయిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య

Published Mon, Jan 4 2016 5:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

5-year-old raped, later strangulated to death

కటక్: ఒడిశాలోని జాజ్పూర్ లో దారుణం జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది.   రోజకూలి చేసుకుని జీవనాన్ని గడిపే  పాప తల్లిదండ్రులు పనికోసం వెళ్లిన తరువాత  అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడు, అనంతరం పాప గొంతు నులిపి హత్య చేశాడు. మృతదేహాన్ని  సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పడేసి  పారిపోయాడు. 
 
సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇరుగుపొరుగు వారి సాయంతో చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పాప మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు చిన్నారి పడి వున్నతీరు,  ప్రాథమిక విచారణ అనంతరం  అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement