girls body
-
నేను అందంగా లేను
టొరంటో: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే యువతులు ఇతర స్నేహితులతో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలు, సోషల్మీడియాలో వేరే యువతులు పెట్టిన ఫొటోలతో పోల్చుకుని తమ శరీర సౌష్ఠవం గురించి బాధ పడతారని అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన ఫ్రొసెసర్ జెన్నిఫర్ మిల్స్ తెలిపారు. కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు మాత్రం అలా బాధ పడరని పేర్కొంది. సోషల్మీడియాలో ఫొటోలను పోస్ట్చేసే యువతులు తన ఫొటోలకు మంచి స్పందన రావాలని కోరుకుంటారని మిల్స్ పేర్కొన్నారు. సోషల్మీడియా వాడే 18–20 ఏళ్ల వారి పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని, ఇతరులతో పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మిల్స్ తెలిపారు. -
అయిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య
కటక్: ఒడిశాలోని జాజ్పూర్ లో దారుణం జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రోజకూలి చేసుకుని జీవనాన్ని గడిపే పాప తల్లిదండ్రులు పనికోసం వెళ్లిన తరువాత అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడు, అనంతరం పాప గొంతు నులిపి హత్య చేశాడు. మృతదేహాన్ని సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పడేసి పారిపోయాడు. సాయంత్రం పనినుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇరుగుపొరుగు వారి సాయంతో చుట్టుపక్కల వెదికారు. ఈ క్రమంలో సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర పాప మృతదేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు చిన్నారి పడి వున్నతీరు, ప్రాథమిక విచారణ అనంతరం అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.