టొరంటో: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడే యువతులు ఇతర స్నేహితులతో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలు, సోషల్‌మీడియాలో వేరే యువతులు పెట్టిన ఫొటోలతో పోల్చుకుని తమ శరీర సౌష్ఠవం గురించి బాధ పడతారని అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన ఫ్రొసెసర్ జెన్నిఫర్ మిల్స్ తెలిపారు. కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు మాత్రం అలా బాధ పడరని పేర్కొంది. సోషల్‌మీడియాలో ఫొటోలను పోస్ట్‌చేసే యువతులు తన ఫొటోలకు మంచి స్పందన రావాలని కోరుకుంటారని మిల్స్ పేర్కొన్నారు. సోషల్‌మీడియా వాడే 18–20 ఏళ్ల వారి పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని, ఇతరులతో పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మిల్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment