Upsets
-
డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం
న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్‌కోడ్‌పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్‌కోడ్‌లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు. -
అంతర్మథనంలో పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడి నుంచి అన్ని హోదాల్లో పనిచేసిన నాయకుడిగా, ఆలిండియా యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎనిమిదిన్నరేళ్లు ఏఐసీసీ సెక్రటరీగా పనిచేసిన తనకే అసెంబ్లీ టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందనే అవమానంతో ఆయన సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల నుంచి పార్టీకి చేస్తున్న సేవను గుర్తించకుండా పొత్తు పేరుతో పొంగులేటి ఆశించిన ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని దక్కకుండా కొందరు టీపీసీసీ పెద్దలు కుట్ర చేశారనే భావనలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఐతో, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని పొంగులేటికి టికెట్ రాకుండా చేశారని చెబుతున్నారు. పార్టీలో పదవులు రాకుండా అడ్డుకున్న నేతలే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే టీపీసీసీ ముఖ్యులు ఇదంతా చేశారని భావిస్తున్న పొంగులేటి వర్గీయులు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పొంగులేటిని బుజ్జగించేందుకు గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నేరుగా రాహుల్‌గాంధీతో సంబంధాలున్న ఆయనకు పార్టీలో అన్యాయం జరగకుండా చూస్తామని, భవిష్యత్తులో ఆయన సేవలను కీలకంగా ఉపయోగించుకుంటామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో రెబెల్స్‌గా బరిలో ఉన్న తండు శ్రీనివాసయాదవ్ (సూర్యాపేట), దళ్‌సింగ్ (ఇల్లెందు), ఎండీ ఫజల్ (ఖమ్మం), కె.శ్రీరాములు (అశ్వారావుపేట) తదితరుల నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయాలని కూడా ఆయనపై ఏఐసీసీ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. పొంగులేటి మాత్రం తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వడంలో టీపీసీసీ పెద్దలు అన్యాయం చేశారనే అవమానభారంతోనే ఉన్నారని తెలుస్తోంది. మరి అధిష్టానం బుజ్జగింపులతో పొంగులేటి సర్దుకుంటారా..? పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై రాహుల్‌కు ఫిర్యాదు చేస్తారా..? తొలి నుంచీ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆయన ఖమ్మంలో ఆ పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. -
నేను అందంగా లేను
టొరంటో: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే యువతులు ఇతర స్నేహితులతో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలు, సోషల్‌మీడియాలో వేరే యువతులు పెట్టిన ఫొటోలతో పోల్చుకుని తమ శరీర సౌష్ఠవం గురించి బాధ పడతారని అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన ఫ్రొసెసర్ జెన్నిఫర్ మిల్స్ తెలిపారు. కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు మాత్రం అలా బాధ పడరని పేర్కొంది. సోషల్‌మీడియాలో ఫొటోలను పోస్ట్‌చేసే యువతులు తన ఫొటోలకు మంచి స్పందన రావాలని కోరుకుంటారని మిల్స్ పేర్కొన్నారు. సోషల్‌మీడియా వాడే 18–20 ఏళ్ల వారి పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని, ఇతరులతో పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మిల్స్ తెలిపారు. -
ఇంత ఘోర పరాభవమా?
ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న కాంగ్రెస్ పెద్దలు గ్రేటర్ నేతలతో పొన్నాల భేటీ అంతకుముందు జానారెడ్డితో కలిసి జైపాల్ నివాసంలో మంతనాలు హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురుకావడా న్ని కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు ఇంత దారుణ ఫలితాలెలా వచ్చాయని తలపట్టుకుంటున్నారు. దీనిపై సమీక్షలు కూడా ప్రారంభించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లు రవి తదితరులు భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని అంచనా వేయలేకపోయామని వారు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయని, తెలంగాణలోనూ అదే కొనసాగిందనే భావన వ్యక్తమైంది. సోనియా తెలంగాణ ఇచ్చినా ఈ అంశాన్ని సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామనే అంచనాకు వచ్చినట్లు తెలిసిం ది. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఓటమిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా సోమవారం నుంచి ఎన్నికల ఫలితాలపై జిల్లాల వారీ సమీక్ష చేయాలని పొన్నాల నిర్ణయించారు. అదే సమయంలో సీఎల్పీ సమావేశం, ప్రతిపక్ష నేత ఎన్నిక వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. హైకమాండ్ పెద్దలతో మాట్లాడిన తరువాత సీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం జానారెడ్డి నివాసంలోనూ టీ కాంగ్రెస్ నేతలు సమావేశమై తెలంగాణలో బలహీనపడిన పార్టీని ఏ విధంగా పునరుత్తేజితం చేయాలనే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. విభజనే కొంపముంచింది!: మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో జిల్లాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. తెలంగాణ, సీమాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల వారూ నివాసం ఉంటున్న హైదరాబాద్‌లో విభజన అంశమే కొంపముంచిందని దానం వాపోయినట్లు తెలిసింది. -
అంతర్మథనంలో హస్తం
పరాజయూనికి కారణాల అన్వేషణలో కాంగ్రెస్ రాహుల్ సలహాదారులపై సీనియర్ల గుర్రు సోనియూ, రాహుల్‌ల రాజీనామాలపై ఊహాగానాలు.. తోసిపుచ్చిన షకీల్ అహ్మద్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయూనికి కారణాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. సోమవారం కీలక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) జరగనుండగా.. అంతకుముందే నేతలు కొందరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశ మవుతుండగా.. రాహుల్ నాయకత్వం, పార్టీ ఎన్నికల వ్యూహం, మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలక సలహాదారులు కొందరిపై సీనియర్ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే టికెట్ల పంపిణీ చేసిన తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. జైరాం రమేశ్, మోహన్‌గోపాల్, మధుసూదన్ మిస్త్రీ, మోహన్ ప్రకాశ్, అజయ్ మాకెన్ తదితరులు విమర్శల దాడికి గురవుతున్నవారిలో ఉన్నారు. రాహుల్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ కూడా సీడ బ్ల్యూసీ భేటీలో రాజీనామాల సమర్పణకు సిద్ధమైనట్టుగా శనివారం మీడియూలో ఊహాగానాలు సాగారుు. అరుుతే ఉన్నతస్థారుు పార్టీవర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చారుు. ‘అంతా ఒట్టిదే. ముందుకు వెళ్లే మార్గం ఇది కాదు. అది పరిష్కారం కూడా కాదు..’ అని పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వర్గాలు వ్యాఖ్యానించారుు. అవన్నీ ఊహాజనిత వార్తలేనని పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చెప్పారు. ఊహాజనిత వార్తలపై తాను ఊహాగానాలు చేయదలుచుకోవడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి కూడా అరుున అహ్మద్ అన్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయూనికి బాధ్యత వహిస్తున్నామని చెప్పిన సోనియూ, రాహుల్.. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా అంగీకరించారు. ఈ విషయంలో మేము ఆలోచించాల్సింది ఎంతో ఉందని అని వారన్నారు. అరుుతే పార్టీ టికెట్టు కేటారుుంచిన తర్వాత కూడా కొందరు అభ్యర్థులు కాంగ్రెస్ విడిచిపోవడం విచారకరమని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్‌శాస్త్రి పేర్కొన్నారు. టికెట్లిచ్చిన తీరుపై తీవ్ర సమీక్ష జరపాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోందని అన్నారు. అప్పుడే పార్టీలో చేరినవారికి పళ్లెంలో పెట్టి టికెట్లు ఇవ్వడం జరగదని రాహుల్ అంతకుముందు చెప్పినా.. పలువురి విషయంలో అలాగే జరిగిందని, అందువల్ల రాహుల్ అభిప్రాయూనికి విరుద్ధంగా వ్యవహరించిన వారే ప్రస్తుత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఓటమిపాలు కావడం.. మంత్రులు, పార్టీ కార్యకర్తలకు మధ్య పూర్తిగా సంబంధాలు లేవనే విషయం స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాహుల్ పనితీరుపై ఒకపక్క పార్టీలో గొణుగుళ్లు ఉన్నప్పటికీ.. గాంధీ కుటుంబ ప్రభావం క్షీణిస్తోందనే వాదనను ఆ నేత తోసిపుచ్చారు. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశామని ఆయన అన్నారు. మరోవైపు బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో మట్టి కరవడాన్ని ఒక నేత గుర్తు చేశారు. కాంగ్రెస్ ఘోర పరాజయూనికి కారణాలను పేర్కొంటూ ఒకటీ రెండురోజుల్లో తాను రాహుల్‌కు లేఖ రాయనున్నట్టు అనిల్ శాస్త్రి తెలిపారు. రాహుల్‌కు కమల్‌నాథ్ మద్దతు రాహుల్‌కు సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ దన్నుగా నిలిచారు. రాహుల్ రాజీనామా చేయూల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. అరుుతే పార్టీ సమీక్షించుకోవాలని, ఇంటిని ఓ క్రమంలో పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గత ఎనిమిది నెలల నుంచే ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరులో గానీ, అది సాధించిన విజయూల్లో కానీ ఆయన పాత్ర ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నారు! ఏమి తర్కమిది?’ అని కమల్‌నాథ్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీయే నియమించింది. పార్టీ ఒక్కటే ఆయన్ను తొలగించగలదు కానీ.. అది ఆ విధంగా చేయూలనుకోవడం లేదు..’ అని ఆయన అన్నారు.