అంతర్మథనంలో హస్తం | The trial of congress party | Sakshi
Sakshi News home page

అంతర్మథనంలో హస్తం

Published Sun, May 18 2014 2:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అంతర్మథనంలో హస్తం - Sakshi

అంతర్మథనంలో హస్తం

పరాజయూనికి కారణాల అన్వేషణలో కాంగ్రెస్
 
రాహుల్ సలహాదారులపై సీనియర్ల గుర్రు
సోనియూ, రాహుల్‌ల రాజీనామాలపై ఊహాగానాలు.. తోసిపుచ్చిన షకీల్ అహ్మద్

 
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయూనికి కారణాలను అన్వేషించే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది. సోమవారం కీలక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) జరగనుండగా.. అంతకుముందే నేతలు కొందరు కత్తులు దూస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) సమావేశ మవుతుండగా.. రాహుల్ నాయకత్వం, పార్టీ ఎన్నికల వ్యూహం, మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కీలక సలహాదారులు కొందరిపై సీనియర్ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే టికెట్ల పంపిణీ చేసిన తీరును బహిరంగంగానే తప్పుబడుతున్నారు. జైరాం రమేశ్, మోహన్‌గోపాల్, మధుసూదన్ మిస్త్రీ, మోహన్ ప్రకాశ్, అజయ్ మాకెన్ తదితరులు విమర్శల దాడికి గురవుతున్నవారిలో ఉన్నారు. రాహుల్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ కూడా సీడ బ్ల్యూసీ భేటీలో రాజీనామాల సమర్పణకు సిద్ధమైనట్టుగా శనివారం మీడియూలో ఊహాగానాలు సాగారుు. అరుుతే ఉన్నతస్థారుు పార్టీవర్గాలు ఈ ఊహాగానాలను తోసిపుచ్చారుు. ‘అంతా ఒట్టిదే. ముందుకు వెళ్లే మార్గం ఇది కాదు. అది పరిష్కారం కూడా కాదు..’ అని పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహితంగా మెలిగే వర్గాలు వ్యాఖ్యానించారుు. అవన్నీ ఊహాజనిత వార్తలేనని పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ చెప్పారు. ఊహాజనిత వార్తలపై తాను ఊహాగానాలు చేయదలుచుకోవడం లేదని కాంగ్రెస్ ప్రతినిధి కూడా అరుున అహ్మద్ అన్నారు.

ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయూనికి బాధ్యత వహిస్తున్నామని చెప్పిన సోనియూ, రాహుల్.. ఇది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా అంగీకరించారు. ఈ విషయంలో మేము ఆలోచించాల్సింది ఎంతో ఉందని అని వారన్నారు. అరుుతే పార్టీ టికెట్టు కేటారుుంచిన తర్వాత కూడా కొందరు అభ్యర్థులు కాంగ్రెస్ విడిచిపోవడం విచారకరమని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్‌శాస్త్రి పేర్కొన్నారు. టికెట్లిచ్చిన తీరుపై తీవ్ర సమీక్ష జరపాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తోందని అన్నారు. అప్పుడే పార్టీలో చేరినవారికి పళ్లెంలో పెట్టి టికెట్లు ఇవ్వడం జరగదని రాహుల్ అంతకుముందు చెప్పినా.. పలువురి విషయంలో అలాగే జరిగిందని, అందువల్ల రాహుల్ అభిప్రాయూనికి విరుద్ధంగా వ్యవహరించిన వారే ప్రస్తుత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం ఓటమిపాలు కావడం.. మంత్రులు, పార్టీ కార్యకర్తలకు మధ్య పూర్తిగా సంబంధాలు లేవనే విషయం స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. రాహుల్ పనితీరుపై ఒకపక్క పార్టీలో గొణుగుళ్లు ఉన్నప్పటికీ.. గాంధీ కుటుంబ ప్రభావం క్షీణిస్తోందనే వాదనను ఆ నేత తోసిపుచ్చారు. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశామని ఆయన అన్నారు. మరోవైపు బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో మట్టి కరవడాన్ని ఒక నేత గుర్తు చేశారు. కాంగ్రెస్ ఘోర పరాజయూనికి కారణాలను పేర్కొంటూ ఒకటీ రెండురోజుల్లో తాను రాహుల్‌కు లేఖ రాయనున్నట్టు అనిల్ శాస్త్రి తెలిపారు.

రాహుల్‌కు కమల్‌నాథ్ మద్దతు

రాహుల్‌కు సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ దన్నుగా నిలిచారు. రాహుల్ రాజీనామా చేయూల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. అరుుతే పార్టీ సమీక్షించుకోవాలని, ఇంటిని ఓ క్రమంలో పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గత ఎనిమిది నెలల నుంచే ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పనితీరులో గానీ, అది సాధించిన విజయూల్లో కానీ ఆయన పాత్ర ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నారు! ఏమి తర్కమిది?’ అని కమల్‌నాథ్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీయే నియమించింది. పార్టీ ఒక్కటే ఆయన్ను తొలగించగలదు కానీ.. అది ఆ విధంగా చేయూలనుకోవడం లేదు..’ అని ఆయన అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement