sucice attempt
-
రాజీవ్ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, తమిళనాడు : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆమె ఈ చర్యకు పాల్పడటానికి కారణం తెలియరాలేదు. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్ నారాయణన్ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. -
నేను అందంగా లేను
టొరంటో: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడే యువతులు ఇతర స్నేహితులతో తమని పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. కెనడాలోని యార్క్ యూనివర్సిటీ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 27 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలు, సోషల్‌మీడియాలో వేరే యువతులు పెట్టిన ఫొటోలతో పోల్చుకుని తమ శరీర సౌష్ఠవం గురించి బాధ పడతారని అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన ఫ్రొసెసర్ జెన్నిఫర్ మిల్స్ తెలిపారు. కుటుంబ సభ్యులతో పోల్చుకున్నప్పుడు మాత్రం అలా బాధ పడరని పేర్కొంది. సోషల్‌మీడియాలో ఫొటోలను పోస్ట్‌చేసే యువతులు తన ఫొటోలకు మంచి స్పందన రావాలని కోరుకుంటారని మిల్స్ పేర్కొన్నారు. సోషల్‌మీడియా వాడే 18–20 ఏళ్ల వారి పట్ల కుటుంబ సభ్యులు శ్రద్ధ చూపాలని, ఇతరులతో పోల్చుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మిల్స్ తెలిపారు. -
ఓ డాల్ఫిన్ ఆత్మహత్యాయత్నం!
భరించరాని కష్టం ఎదురైనప్పుడో, శత్రువు చేతిలో చావకూడదనుకున్నప్పుడో కొంత మంది ఆత్మహత్యను ఆశ్రయిస్తారు. జంతువులు కూడా అలాంటి పరిస్థితిలో ఆత్మార్పణకు సిద్ధమవుతాయా? జపాన్ ఫసిపిక్ తీరంలోని తాయ్ జి పట్టణం. అక్కడి సముద్రపాయలో వేలాది సముద్ర జీవులు నివసిస్తూఉంటాయి. జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ లాంటి తాయ్ జి తీరంలో ఏటా సెప్టెంబర్ మాసంలో డాల్ఫిన్ల వేట కొనసాగుతుంది.. అది కూడా ప్రభుత్వ అనుమతితో! మొదట సాంప్రదాయంగా మొదలై ప్రస్తుతం ఫక్తు వ్యాపారంగా మారిన డాల్ఫిన్ల వేట ఆటవిక చర్య అంటూ పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అయినా వేట ఆగలేదు. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 1న మొదలైంది. ఆ క్రమంలోనే సెప్టెంబర్ 12న వేటగాళ్లకు చిక్కింది రిస్సోస్ జాతికి చెందిన ఓ యువడాల్ఫిన్.. అప్పటివరకు తన సమూహంతో సరదాగా గడిపిన ఆ డాల్ఫిన్.. వేటగాళ్లు గోడలా కట్టిన వలకు ఇవతలివైపు వచ్చి మృత్యువలలో చిక్కుకుపోయింది. తప్పించుకోవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించి విఫలమైంది. వేటగాళ్ల చేతిలో చావడం ఇష్టం లేక ఆత్మాహత్యాయత్నం చేసింది. తీరంలోని రాళ్లకేసి తన శరీరాన్ని పదేపదే కొట్టుకుంది. ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. మరికొద్ది క్షణాల్లో డాల్ఫిన్ చనిపోతుందనగా.. మోటారు బోటులో దగ్గరకు వెళ్లిన వేటగాళ్లు దాన్ని తిరిగి నీళ్లలోకి చేర్చారు. అలాగని వాళ్లు దాన్ని కనికరించినట్లు కాదు.. డాల్ఫిన్ ను సజీవంగా పట్టుకుని అక్వేరియం వాళ్లకిస్తే బోలెడు డబ్బులొస్తాయని. ఇక ఈ డాల్ఫిన్ సజీవంగా దొరికే అవకాశం లేదని నిర్ధారించుకున్నాక.. దాన్ని చంపాలనే నిర్ణయానికి వచ్చారు. పదునైన ఖడ్గంతో నీళ్లలోకి డైవ్ చేశాడో వేటగాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో చాలా మందిని ఆకర్షిస్తున్నది. తెలివితేటలతో వ్యవహరించడంలో చింపాంజీ, కోతుల తర్వాతి స్థానం డాల్ఫిన్లదేనని శాస్త్రజ్ఞులు చెబుతారు. మనుషుల్లా అవీ క్షీరదాలే. మనం పెంచినట్లే డాల్ఫిన్లు కూడా పిల్లల్ని అల్లారముద్దుగా పెంచుతాయి. మెదడు కూడా పెద్ద సైజులో ఉంటుంది. అవి కూడా సంక్లిష్టతతో కూడిన సంఘ జీవితాన్నే ఫాలోఅవుతాయి. మనం మాట్లాడినట్లే అవి విజిల్స్ చప్పుళ్లతో సంభాషించుకుంటాయి. జంటను ఆకర్షించడానికి అందంగా, హుందాగా నడుచుకుంటాయి. మనుషులతో ఇన్ని పోలికలున్న డాల్ఫిన్లు ఆత్మహత్యలు చేసుకోవడం విడ్డూరమేమీ కాదని కొందరి వాదన. తాయ్ జీ తీరంలో డాల్ఫిన్ల వేటను నిరసిస్తూ అమెరికాకు చెందిన రిక్ ఓబెరీ రూపొందిచిన 'ది కోవ్' అనే డాక్యూమెంటరీ సినిమాకు 2009తో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు లభించింది. చిన్నప్పటినుంచి డాల్ఫిన్లను ప్రేమించే రిక్.. వాటి సంరక్షణ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని నడుపుతున్నాడు. -
తహశీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం
వరంగల్: పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని చిన్న ముప్పారం గ్రామ పంచాయతి పరిధిలోని పెద్దతండాకు చెందిన గుగులోతు మంగ్యా(55) తన భూమికి చెందిన పాస్ పుస్తకాలు ఇవ్వలని గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. అధికారులు అతని మొర ఆలకించకపోవడంతో.. మనస్తాపానికి గురైన మంగ్యా తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వెద్యులు తెలిపారు.