పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు.
వరంగల్: పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
మండలంలోని చిన్న ముప్పారం గ్రామ పంచాయతి పరిధిలోని పెద్దతండాకు చెందిన గుగులోతు మంగ్యా(55) తన భూమికి చెందిన పాస్ పుస్తకాలు ఇవ్వలని గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. అధికారులు అతని మొర ఆలకించకపోవడంతో.. మనస్తాపానికి గురైన మంగ్యా తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వెద్యులు తెలిపారు.