nellikuduru
-
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..
సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు తొర్రూర్ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్‌కుమార్ నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్‌తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ట్రాక్టర్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్ కుమార్‌ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. వెలుగు చూసింది ఇలా.. బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్‌ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్‌కుమార్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్ఓ పోస్టు నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో కిరణ్‌కుమార్ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు. -
29 మంది విద్యార్థినులకు అస్వస్థత
నెల్లికుదురు కస్తూర్బా పాఠశాలలో పురుగుల అన్నం నెల్లికుదురు (మహబూబాబాద్): పురుగుల అన్నం తిని 29 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నెల్లికుదురులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ విద్యాలయంలో 198 మంది విద్యార్థినులకు గాను ప్రస్తుతం 143 మంది ఉంటున్నారు. శనివారం పురుగులున్న బియ్యంతో వండి సరిగ్గా ఉడకని అన్నం తినడంతో 29 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో వారిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 11 గంటలకు అంబులెన్స్‌లో రెండు దఫాలుగా మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు నైట్ ఇన్చార్జ్ టీచర్ మాలోతు మంజుల తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి శ్రీరాం నెల్లికుదురులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం స్థానిక మండల వైద్యాధికారి జ్యోతి తో కలసి సందర్శించారు. వంట సామాన్లు భద్రపరిచే గది, తాగునీరు, నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంటు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతా లను పరిశీలించారు. పురుగుల అన్నం పెడుతున్నారని తినలేకపోతున్నామని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, శనివారం రాత్రి సరిగ్గా ఉడకని పురుగుల అన్నం పెట్టారని విద్యార్థినులు శ్రీరాం దృష్టికి తెచ్చారు. శ్రీరాం విలేకరులతో మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగాఉన్నాయని, హెడ్కుక్ నిర్లక్ష్యంతో పురుగుల అన్నం పెట్టడం వల్ల పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. -
నెల్లికుదురులో గిరిజన విద్యార్థిని అదృశ్యం
నెల్లికుదురు : ఓ గిరిజన విద్యార్ధిని అదృశ్యమైన సంఘటన మండలంలోని జామతండా శివారు జాదుతండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొబేషనరీ ఎస్సై రాకేష్ కథనం ప్రకారం.. జాదు తండాకు చెందిన గిరిజన విద్యార్థి నెల్లికుదురు జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 19న పాఠశాలకని వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని విద్యార్థిని మేనమామ గుగులోతు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఎస్సై తెలిపారు. -
తహశీల్దార్ ఆఫీసులో రైతు ఆత్మహత్యాయత్నం
వరంగల్: పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంలో అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ మనస్తాపానికి గురైన ఓ రైతు తహశీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని చిన్న ముప్పారం గ్రామ పంచాయతి పరిధిలోని పెద్దతండాకు చెందిన గుగులోతు మంగ్యా(55) తన భూమికి చెందిన పాస్ పుస్తకాలు ఇవ్వలని గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. అధికారులు అతని మొర ఆలకించకపోవడంతో.. మనస్తాపానికి గురైన మంగ్యా తహశీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వెద్యులు తెలిపారు.