మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది.
రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు.
కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్‌మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్‌కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment