నటి సబర్న మృతి కేసులో పురోగతి
నటి సబర్న మృతి కేసులో కీలక ఆధారాలు
Published Tue, Nov 15 2016 9:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:41 PM
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ, సినీనటి సబర్న, అలియాస్ సుగుణ మృతి కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. పరారీలో ఉన్న ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై మదురవాయిల్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఇటీవల సబర్న అనుమానాస్పద స్థితిలో మతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా ఉండగా ఆమె ఉత్తరాది సినీ రంగానికి చెందిన వ్యక్తిని ప్రేమించినట్టు తెలిసింది. ఏడాది క్రితం వీరు రహస్య వివాహం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కారణంగానే ఆమె తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉంటుందని, గత రెండు నెలలుగా సపర్నను చూసేందుకు భర్త రాలేదని పోలీసుల విచారణలో తెలిసింది.
దీంతో ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా సపర్న ఇబ్బందులు పడ్డారని, భర్తతో సెల్‌ఫోన్లో మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఇలాఉండగా ఆమె మృతికి ముందురోజు భర్త సవర్నను చూసేందుకు వచ్చినట్టు తెలిసింది. అతను తిరిగి వెళుతున్న సమయంలో తనతోనే ఉండాలని ఆమె బెదిరించిందని, అంతేగాకుండా కత్తి తీసుకుని చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పోలీసులకు అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమె భర్త సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో సవర్నను హత్య చేసి ఆధారాలను నాశనం చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సపర్ణ మృతి తర్వాత ఇంతవరకు భర్త వచ్చి చూడకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. ఒక మ్యూజిక్ ఛానల్ లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన సబర్న ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో నటించారు. పూజై, కుదిరసు, కలై లాంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు.
Advertisement
Advertisement