సామర్లకోటలో అబ్కారీ అకాడమీ | Abkari academy will shift to Samarlakota | Sakshi
Sakshi News home page

సామర్లకోటలో అబ్కారీ అకాడమీ

Published Fri, Jul 1 2016 7:02 PM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

Abkari academy will shift to Samarlakota

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో అబ్కారీ అకాడమీ ఏర్పాటు కానుంది. అకాడమీ ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద అబ్కారీ అకాడమీ ఏర్పాటు చేయాలని భావించారు. ఇక్కడ ఉన్న అటవీ భూముల్లో అకాడమీ ఏర్పాటు చేస్తే ఎక్సైజ్ సిబ్బంది శిక్షణకు అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ క్రైం రేటు అధికంగా ఉందనే కారణంతో ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు అబ్కారీ అకాడమీ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉమ్మడి రాష్ట్రాలకు శిక్షణ కేంద్రంగా ఉంది. అకాడమీలో డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో అబ్కారీ ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. బండ్లగూడ నుంచి అకాడమీని తరలించి సామర్లకోటలో త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement