
సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 219వ రోజు సోమవారం ఉదయం ప్రారంభమైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో సందడి మొదలైంది. అడుగడుగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దారి పొడవునా స్థానిక ప్రజలు వైఎస్ జగన్‌కు సమస్యలు విన్నవించుకుంటున్నారు.
ఉండూరు నుంచి సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. సామర్లకోట మాతం సెంటర్, అయోధ్యా రామాపురం, చలపతి నగర్ మీదుగా గణపతి నగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,574.9 కిలోమీటర్లు నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment