లారీ ఢీకొని బైక్ దగ్ధం
Published Mon, Dec 9 2013 3:25 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
సామర్లకోట, న్యూస్‌లైన్ : కాకినాడ-సామర్లకోట ఏడీబీ రోడ్డులో అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోటార్ బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఓ యువతి గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం హుస్సేన్‌పురానికి చెందిన మద్దిల నిరీక్షణకుమార్, ప్రసన్న అన్నాచెల్లెళ్లు. ఆది వారం కావడంతో మోటార్ బైక్‌పై నిరీక్షణ కుమార్‌తో కలిసి ప్రసన్న కాకినాడలో చర్చికి బయలుదేరింది. ఏడీబీ రోడ్డు అచ్చంపేట వంతెన మలుపు వద్ద ఎదురుగా మోటార్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సడన్ బ్రేక్ వేశాడు.
దీంతో నిరీక్షణ కుమార్ నడుపుతున్న బైక్ దానిని ఢీకొంది. ఈ ధాటికి వెనుక కూర్చున ప్రసన్న రోడ్డుపై పడిపోయింది. ఆమెను కా పాడే ప్రయత్నంలో ఉండగా, కాకినాడ నుంచి లారీ దూసుకురావడాన్ని గమనించి బైక్‌పై నుంచి నిరీక్షణకుమార్ దూకేశాడు.దీంతో బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లిన ఆ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమం లో బైక్ నుంచి మంటలు చెలరేగి, కాలి బూడిదైంది. లారీని గుర్తించలేదని నిరీక్షణకుమార్ చెప్పాడు. ప్రసన్న తలకు తీవ్ర గాయమైంది. 108కు ఫోన్ చేయగా సకాలంలో రాలేదు. దీంతో ఆమెను ఆటోలో మా ధవపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఎస్సై ఎండీఎంఆర్ ఆలీఖాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement