సామర్లకోట (తూర్పు గోదావరి) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో పూరిపాకతోపాటు.. రూ. 3 లక్షల నగదు కాలి బూడిదైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ జానీ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఇనుము లోడును అమ్మి రూ. 3 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచి వ్యాపారానికి వెళ్లాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వృద్ధురాలు టీ కాచుకొని స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో అగ్నిప్రమాదం జరిగి జానీ ఇంటకి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను ఆర్పేలోపే ఇంట్లో ఉన్న డబ్బు కాలి బూడిదైంది.
అగ్నిప్రమాదంలో రూ.3 లక్షలు బుగ్గి
Published Thu, Oct 15 2015 5:38 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement