rs. 3 lakhs
-
గుంతకల్లులో అగ్ని ప్రమాదం
గుంతకల్లు : గుంతకల్లులోని మస్తానయ్య దర్గా సమీపంలో గల ఆలియా పరుపుల దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆలియా పరుపుల దుకాణం నిర్వహకులు రియాజ్, మస్తాన్‌బీ దిన చర్యల్లో భాగంగా ఉదయం దుకాణం తెరుచుకొని పరుపులు కుడుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరూ గాయపడ్డారు కూడా. దుకాణం నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు అదుపు చేశారు. గాయపడిన ఇద్దరినీ స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో సమారు రూ.3 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. -
అగ్నిప్రమాదంలో రూ.3 లక్షలు బుగ్గి
సామర్లకోట (తూర్పు గోదావరి) : ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో పూరిపాకతోపాటు.. రూ. 3 లక్షల నగదు కాలి బూడిదైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహ్మద్ జానీ పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇనుము లోడును అమ్మి రూ. 3 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచి వ్యాపారానికి వెళ్లాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వృద్ధురాలు టీ కాచుకొని స్టవ్ ఆఫ్ చేయకపోవడంతో అగ్నిప్రమాదం జరిగి జానీ ఇంటకి మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను ఆర్పేలోపే ఇంట్లో ఉన్న డబ్బు కాలి బూడిదైంది.