గుంతకల్లు : గుంతకల్లులోని మస్తానయ్య దర్గా సమీపంలో గల ఆలియా పరుపుల దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆలియా పరుపుల దుకాణం నిర్వహకులు రియాజ్, మస్తాన్‌బీ దిన చర్యల్లో భాగంగా ఉదయం దుకాణం తెరుచుకొని పరుపులు కుడుతుండగా ఒక్కసారిగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఇద్దరూ గాయపడ్డారు కూడా. దుకాణం నుంచి పొగలు, మంటలు వస్తుండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు అదుపు చేశారు. గాయపడిన ఇద్దరినీ స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో సమారు రూ.3 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా.