సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలకేంద్రంలో ఓ పాతనేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సామర్లకోటలోని కొత్తపేటకాలనీకి చెందిన జావర దుర్గ(22) సామర్లకోటతో పాటు పెద్దాపురం, గండేపల్లి పోలీస్‌స్టేషన్లలో పలు చోరీ కేసుల్లో నిందితుడు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి రూ.3 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.