రైలు బోగీలో ప్రసవం | Childbirth in a train bogie at Andhra pradesh | Sakshi
Sakshi News home page

రైలు బోగీలో ప్రసవం

Published Mon, Feb 21 2022 5:48 AM | Last Updated on Mon, Feb 21 2022 8:09 AM

Childbirth in a train bogie at Andhra pradesh - Sakshi

బొకారో ఎక్స్‌ప్రెస్‌ నుంచి బిడ్డను తీసుకు వెళుతున్న 108 సిబ్బంది

సామర్లకోట: చెన్నై నుంచి జార్ఖండ్‌ వెళుతున్న ఓ గర్భిణి ఆదివారం రైలులో ప్రసవించింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన శంకర్‌ క్రికిత్త ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నాడు. అతడి భార్య వాసకుమారి(21) ప్రస్తుతం ఏడో నెల గర్భిణి. దీంతో శంకర్‌ ఆమెను పుట్టిల్లయిన జార్ఖండ్‌ తీసుకువెళుతున్నాడు. భార్యాభర్తలిద్దరూ బొకారో ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి జార్ఖండ్‌ బయలుదేరారు.

రైలు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట వచ్చాక ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను భర్త బాత్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై తోటి ప్రయాణికులు 108కు సమాచారం ఇచ్చారు. రైలును కొద్దిసేపు సామర్లకోటలో నిలిపివేశారు. స్టేషన్‌కు చేరుకున్న 108 సిబ్బంది తల్లీబిడ్డలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ తీసుకెళ్లాల్సిందిగా వారికి సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement