ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో జయేంద్ర సరస్వతి | jayendra saraswati in sri prasannanjaneya swamy temple | Sakshi
Sakshi News home page

ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో జయేంద్ర సరస్వతి

Published Sat, May 24 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో  జయేంద్ర సరస్వతి

ప్రసన్నాంజనేయస్వామి సన్నిధిలో జయేంద్ర సరస్వతి

 సామర్లకోట, న్యూస్‌లైన్ :  కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామీజీ శుక్రవారం సామర్లకోటలోని ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చారు. ఆలయ చైర్మన్, ప్రసిద్ధ సిద్ధాంతి, కంచికామకోటి పీఠం సభ్యుడు చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి నివాసానికి తొలుత చేరుకున్న స్వామీజీకి ఘన స్వాగతం లభించింది. అనేక మంది భక్తులు జయేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ప్రసన్నాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న స్వామీజీ ఆలయంలోని గణపతికి, ఆంజనేయస్వామికి పూజలు చేశారు.

 ఈ సందర్భంగా జరిగిన హోమాన్ని ఆయన దర్శించారు. ఆలయం వద్ద ఉన్న 65 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి వారికి స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చింతామణి గణపతిశాస్త్రి స్వామీజీని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. ప్రసన్నాంజనేయ స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేశారు. స్వామీజీ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.  పలువురు పారిశ్రామిక వేత్తలు, రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement