కోలాహలంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు | YSRCP Candidates Filed Nominations In Andhra Pradesh Election 2019 | Sakshi
Sakshi News home page

కోలాహలంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు

Published Thu, Mar 21 2019 12:22 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YSRCP Candidates Filed Nominations In Andhra Pradesh Election 2019 - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చేనెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా గురు, శుక్రవారాల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లతో సందడి వాతావరణం నెలకొంది.

  • చిత్తూరు జిల్లా మదనపల్లి శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎం నవాజ్‌ పాషా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
     
  • ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు నామినేషన్‌ వేశారు. కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. 
     
  • కృష్ణాజిల్లా తిరువూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కె రక్షణ నిధి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
     
  • అనంతపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తలారి రంగయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
     
  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్త ఎత్తున్న పాల్గొన్నారు.
     
  • అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  వైఎస్సార్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా వై వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
     
  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు, మోషన్ రాజు, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, జాన్సన్, ఉమాబాల, రామకృష్ణం రాజు తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు.
     
  • శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నామినేషన్ వేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

  • కృష్ణా జిల్లా నూజీవీడు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేకా ప్రతాప్‌ అప్పారావు ఈ రోజు ఉదయం 11.20 గంటలకు నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణంలోని ద్వారకా ఎస్టేట్ నుండి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు. అవనిగడ్డ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌, పామర్రు అభ్యర్థిగా అనిల్‌ కూమార్‌లు నామినేషన్లు వేశారు.
     
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేశారు.

  • తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్ నామినేషన్ వేశారు. ముందుగా ద్వారకా తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట జిల్లా అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తులు తరలివచ్చారు. రామచంద్రపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గా చెల్లుబోయిన వేణు నామినేషన్ దాఖలు చేశారు. 
     
  • నెల్లూరు సిటీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్‌ వేశారు. గాంధీ బొమ్మ నుంచి వందలాది మంది కార్యకర్తలతో నామినేషన్‌కు తరలివచ్చారు.
  • కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీమంత్రి కొలుసు పార్థసారధి నామినేషన్ దాఖలు చేశారు. పోరంకి నుంచి పెనమలూరు వరకు భారీ ర్యాలీ తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు
     
  • శ్రీకాకుళం టెక్కలి అభ్యర్థి పేరాడ తిలక్‌, రాజాం అభ్యర్థి కంబాల జోగులు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. 
  • అరకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ భారీ ర్యాలీగా తరలి వచ్చిన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటి రమ్యశ్రీ, విద్యార్థి నాయకులు తేడబారికి సురేష్ కుమార్‌, యూత్ అద్యక్షులు వినయ్‌ రేగ మత్సలింగం,మిథుల తదితరులు పాల్గొన్నారు.
     
  • బనగానపల్లె వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నామినేషన్  వేశారు. రామిరెడ్డితో పాటు ఎర్రబోతుల వెంకట్ రెడ్డి, పట్టణ మాజీ సర్పంచ్ లక్ష్మి రెడ్డి, శంకర్ రెడ్డి లు నామినేషన్ కార్యాక్రమనికి వెళ్లారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం పెరిగిపోయాయని రామిరెడ్డి పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల అరాచకాలు, ఎమ్మెల్యే దురగతాలు నియోజకవర్గంలో పెరిగిపోయాయని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి పాలన లో రైతులకు, మహిళలకు, ప్రతి వర్గం వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. వైఎస్సార్‌ రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ని అధికారంలోకి తీసుకురావాలని గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని కాటసాని రామిరెడ్డి ధీమా వ్యక్తం శారు.
     
  • కడపలో లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రెండవ సారి ప్రజల ఆశిస్సులతో ఎంపీ గా పోటీ చేస్తున్నానన్నారు. ‘నికర జలాల సాధన కోసం పోరాటం తాను పోరాటం చేశానన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశానని మళ్లీ తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కోత్త రైళ్ళను జిల్లాలో నడిపించే విధంగా కృషి చేశానన్నారు. ఆలు లేదు సోలు లేదన్న చందంగా మారిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉక్కు పరిశ్రమ వంటి సమస్యలపై భవిష్యత్తులో పోరాటం చేస్తానని తెలిపారు. భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు.
     
  • విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం వైస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్నదొర నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం ఉదయం 11 గంటల ముహూర్తం సమయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ జరజాపు ఈశ్వర్ రావు మాజీ వైస్ చైర్మన్ పువ్వుల నాగేశ్వరరావు సాలూరు జడ్పిటిసి రెడ్డి పద్మావతి మాజీ మున్సిపల్ చైర్మన్ ముగడ గంగమ్మ తదితరులు హాజరయ్యారు.

మెజార్టీ అభ్యర్థులందరూ 22నే
వెఎస్సార్‌సీపీ తరపున విశాఖ, అరకు, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, కాండ్రేగుల సత్యవతిలు 22వ తేదీన నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులు బూడి ముత్యాలనాయుడు(మాడుగులు), అవంతి శ్రీనివాస్‌ (భీమిలి), గుడివాడ అమర్‌నాథ్‌(అనకాపల్లి), అన్నంరెడ్డి అదీప్‌రాజు (పెందుర్తి), కరణం ధర్మశ్రీ (చోడవరం), గొల్ల బాబూరావు(పాయకరావుపేట), తిప్పల నాగిరెడ్డి (గాజువాక), కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పాడేరు), అక్కరమాని విజయలక్ష్మి(విశాఖ తూర్పు), ద్రోణంరాజు శ్రీనివాస్‌ (విశాఖ దక్షిణం), యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు) (యలమంచలి)లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మెజార్టీ జనసేన, బీజేపీ అభ్యర్థులందరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement