సీమాంధ్రలో మోగిన ఎన్నికల నగారా | Elections 2014: seemandhra Election Notification Released | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో మోగిన ఎన్నికల నగారా

Published Sat, Apr 12 2014 11:08 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Elections 2014: seemandhra Election Notification Released

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్రలో ఎన్నికల నగారా మోగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జరగనున్న 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

కాగా  ఈనెల 13న ఆదివారం, 14న అంబేద్కర్‌ జయంతి, అలాగే 18వ తేదీ గుడ్‌ఫ్రైడేను సెలవు దినాలుగా ప్రకటించారు. దాంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుది గడువు. పోలింగ్‌ మే 7వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుపుతారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement