పురపాలక సంఘాలు, నగరపంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఓ క్రతువు ముగిసింది. నామినేషన్ల పరిశీలన ఘట్టం ఇప్పటికే పూర్తయింది. మరో వైపు అభ్యర్థులు ప్రచారానికి పదును పెట్టారు. ఓటరు మహాశయుని కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఐదు రోజులపాటు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల పరిధిలో మొత్తం 3,083 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన ఆదివారం కొలిక్కి వచ్చింది. మొ త్తం 323 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 2,758 నామినేషన్లు అర్హత సా ధించాయి. దేవరకొండలో దాఖలైన నామినేషన్లలో సగానికిపైగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 340 నామినేషన్లకుగాను 190 నామినేషన్లను అధికారులు తి రస్కరించారు.
భువనగిరిలో ఒక్కటి కూడా తిరస్కరణకు గురికాలేదు. అయితే కొన్ని స్థానాలకు ఒక్కో అభ్యర్థి రెండు నామినేషన్లు కూడా సమర్పించారు. ఒకటి కాకపోయినా ఒక టైనా అర్హత సాధిస్తాయన్న ఉద్దేశంతో ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు అందజేశారు. ఈ క్ర మంలో చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లు 18వ తేదీన ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తద్వారా అంతి మంగా బరిలో నిలి చే అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలనుంది.
ప్రచారబాట పట్టిన అభ్యర్థులు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అప్పుడే ప్రచారబాట పట్టా రు. వాడల్లో తిరుగుతూ తమకే ఓటేయాలని అర్థిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోవద్దన్న కృత నిశ్చయంతో ఉన్న అభ్యర్థులు ముందు నుంచే ప్రచారం సాగిస్తున్నారు. పరిశీలన లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మున్సిపాలిటీల్లో ప్రచారానికి దిగుతున్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ప్రచారంలో తలమునకల య్యా రు. చైర్‌పర్సన్ అభ్యర్థులదీ ఇదేబాట. ప్రచార ఖర్చు కు ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తుండటంతో అభ్యర్థులు కొంత జంకుతున్నారు. ఎలాగైనా గెలవాలనే తపనతో మరికొం దరు ఖర్చుకు వెనకాడటం లేదు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం, ఇతర ఖర్చులు పెట్టేస్తున్నారు.