
సాక్షి, ఒంగోలు అర్బన్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా శాసనసభా స్థానాలకు జాతీయ, రాష్ట్రీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 234 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో 65 నామినేషన్లు తిరస్కరించగా గురువారం 14 నామినేషన్లు ఉపసంహరణ అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాలో 155 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటున్నట్లు తుది జాబితా ఖరారైంది. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 32 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 27 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఒక నామినేషన్ ఉపసంహరించుకోగా మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో ఉంటారని నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment