95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగి నెలన్నర (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) అవుతోంది. అప్పుడే 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ప్లాన్ మొదలుపెట్టింది కమిటీ. వచ్చే ఏడాది మార్చి 10న ఆస్కార్ వేడుక జరపనున్నట్లు ప్రకటించి, ఇందుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను కూడా వెల్లడించారు నిర్వాహకులు.
96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్‌ను ఈ ఏడాది డిసెంబరు 21న ప్రకటిస్తారు. నామినేషన్స్‌ను వచ్చే ఏడాది జనవరి 23న వెల్లడిస్తారు. ఆస్కార్ విజేతల ఎంపికకు ఫిబ్రవరి 22న ఓటింగ్ ఆరంభించి, 27 వరకూ కొనసాగిస్తారు. అవార్డుల ప్రదానోత్సవం మార్చి 10న జరుగుతుంది. ఇక జనరల్ ఎంట్రీ కేటగిరీలో అవార్డుల దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 15 చివరి తేదీగా పేర్కొంది కమిటీ. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment