
జనవరి 24. హాలీవుడ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. విశేషం ఏంటా అనుకుంటున్నారా? మార్చి 4న 90వ ఆస్కార్ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబందించిన నామినేషన్స్ ఈ బుధవారం అనౌన్స్ చేస్తారట. ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన చిన్న క్లూను ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్’ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
ఆ క్లూ ఏంటంటే.. ఆస్కార్ ఫైనల్స్ రౌండ్ వరకూ చేరుకున్న యాక్టర్స్, మూవీస్ నామినేషన్ లిస్ట్‌ను బాలీవుడ్ నటి, హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా రివీల్ చేస్తారట. ప్రియాంకతో పాటు రెబల్ విల్సన్, రొసారియో డాసన్, మిచెల్ రోడ్రిగేజ్ లాంటి హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో పాల్గొంటారట. దీనికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ పిక్స్‌ను బయటకు వదిలి ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరింత ఆసక్తి రేపింది ‘ఆస్కార్ బృందం’.
Comments
Please login to add a commentAdd a comment