ఇప్పటివరకు 114 నామినేషన్ల తిరస్కరణ | GHMC elections:Nominations of 145 candidates rejected | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు 114 నామినేషన్ల తిరస్కరణ

Published Mon, Jan 18 2016 8:09 PM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM

GHMC elections:Nominations of 145 candidates rejected

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 114 నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఆయన సోమవారమిక్కడ వెల్లడించారు. ఇంకా 23 వార్డులకు సంబంధించి వివరాలు అందలేదని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, ముగ్గురు సంతానం ఉన్నవారి నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ తెలిపారు.

మరోవైపు 126వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉండటంతో అధికారులు నామినేషన్ తిరస్కరించడం జరిగింది. కాగా  1-6-1994 నాటికి ముగ్గురు పిల్లలు ఉంటే వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement