హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే మధ్యలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి.
ఆ సెలవుల రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 13వ తేదీన ఆదివారం సెలవు వస్తోంది. అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతిని, అలాగే 18వ తేదీ గుడ్‌ఫ్రైడేను నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించారు. దీంతో ఈ మూడు రోజుల్లోను నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుదిగడువు. పోలింగ్ మే 7న, ఓట్ల లెక్కింపు 16న జరుగుతాయి
సీమాంధ్రలో ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ జారీ
Published Sat, Apr 12 2014 3:54 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement