Seemadhra
-
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సీమాంద్ర విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడేవారు మధ్య విద్వేషాలు మంచిది కాదని శంక్రరావు అన్నారు. -
అవసరమనుకుంటే సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్: రైల్వే మంత్రి
బెంగళూరు: సీమాంధ్ర అభివృద్ధి కోసం అవసరమనుకుంటే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా రైల్వే లైన్లు, జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా సీమాంధ్రలో ప్రత్యేకరైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రయాణికులకు భద్రత పెంపు కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయంలో ‘మెట్రోమాన్’గా పేరుగాంచిన శ్రీధరన్‌ను స్వయంగా కలిసి కమిటీకి సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తానన్నారు. కేవలం భద్రతపరంగానేకాక ఇతర అంశాల విషయంలో కూడా నిపుణుల సలహాలు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రితో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు. ఇందులో ఎవరెవరు ఉంటారో ఇంకా నిర్ణయించనప్పటికీ శ్రీధరన్మాత్రం కచ్చితంగా ఉంటారన్నారు. భద్రత, రక్షణ, సేవ, వేగం అనే అంశాలు తన ఎజెండా అన్నారు. అభివృద్ధిపథంలో ముందుకు సాగడానికి నూతన ఆవిష్కారాలు ఎంతో అవసరమన్నారు. -
రాజధాని ‘భూ’మ్
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొండెక్కిన భూముల ధరలు సాక్షి, హైదరాబాద్: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్టర్ల దృష్టంతా ప్రస్తుతం ఈ రెండు జిల్లాల పైనే ఉంది. నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం నేపథ్యంలో ఇక్కడి భూములకు భారీగా డిమాండ్ వచ్చింది. రాజధానిగా ఏర్పడితే భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే భావనతో ఈ ప్రాంతంలో చాలామంది భూములు, స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇక్కడ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక్కడ తప్ప అంతటా తగ్గుదలే.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, నెల్లూరు తదితర అన్ని రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. ఆ మేరకు ఆదాయం కూడా తగ్గింది. అయితే కృష్ణా, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ప్రకాశం రిజిస్ట్రేషన్ జిల్లాల్లో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాల్లో ఈ ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్లు, రాబడి అనూహ్యంగా పెరగడం విశేషం. విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లాల్లో గత ఏడాది ఏప్రిల్‌లో 2,515 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 7.43 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అదే నెలలో 3,831 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14.28 కోట్ల ఆదాయం వచ్చింది. విజయవాడ తూర్పు జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 3,493 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8.78 కోట్ల రాబడి రాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 4,608 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 15.93 కోట్ల ఆదాయం వచ్చింది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏప్రిల్‌లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున చాలామంది డబ్బు తీసుకెళ్లే మార్గం లేక అడ్వాన్సులు ఇచ్చి మే, జూన్ నెలల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అందువల్ల ఈ నెలలోనూ, వచ్చే నెలలోనూ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమ్మో! ఇవెక్కడి ధరలు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక వైపు పొలాల్లో వేసిన వెంచర్లో రెండు నెలల కిందట చదరపు గజం స్థలం రూ. 1200 ఉండగా ఇప్పుడు రూ. 7000కు పెరిగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో రెండు నెలల కిందట రూ. 20 లక్షలున్న ఎకరా భూమి ఇప్పుడు రూ. 2 కోట్లు పలుకుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో రెండు నెలల కిందట ఎకరం పొలం రూ. 15 లక్షలు ఉండగా ఇప్పుడు రూ. కోటిన్నరకు పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో యజమానులు భూముల్ని అమ్మేందుకు ఆసక్తి చూపడం లేదు. -
హామీల పై వెనక్కి వెళ్లను : బాబు
దానికి తగిన ప్రణాళిక రచిస్తాం రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి తెలంగాణ అభివృద్ధికి సాయపడుతాం న్యూఢిల్లీ: ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో వారి కష్టాలు దూరం చేసే సదుద్దేశంతోనే రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు ఇచ్చానని... వాటి నుంచి దూరంగా వెళ్లబోనని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో పరిస్థితి హీనంగా మారినా హామీల అమలుకు తగిన ప్రణాళిక రూపొందిస్తానన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈరోజు సుదినం. పదేళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశానికి ఒక శుభారంభం జరిగింది. మోడీ ప్రధాని కానుండడం దేశంలో ఒక కొత్త శకానికి ప్రారంభం. ఒక కొత్త ఆశ. ఎఫ్‌డీఐలు, పెట్టుబడులు, సుపరిపాలన, నిజాయతీ కలిగిన పాలన కోసం దేశం చూస్తోంది. మొన్నటి ఎన్నికల్లో అవినీతిపై ప్రజలు తీర్పు ఇచ్చారు. మోడీ తొలుత 272+ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో నేను ఆనాడే హైదరాబాద్‌లో ఎన్డీఏకు 300కు పైగా స్థానాలు వస్తాయని చెప్పాను. 330కి పైగా వచ్చాయి. ప్రజలు ఆవేదన ఓటుగా మారింది. దేశం ఇప్పుడు ఉపశమనంగా భావిస్తోంది. రాష్ట్రంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ప్రజలు కసిగా కాంగ్రెస్‌ను ఓడించారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ పునాదుల నుంచి అభివృద్ధి చేయాలి. తెలంగాణలో కూడా సామాజిక అభివృద్ధి జరగాలి. నేను చేపట్టిన పనులు సంపద, ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తాం. కేంద్రం నుంచి కూడా సాయం అందేలా చూస్తాం’’ అని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరతాం ఎన్డీఏ ప్రభుత్వంలో తాము చేరతామని చంద్రబాబు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్రంలో గతంలో జనతా ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చామని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమీ లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నరేంద్ర మోడీ తనకన్నా ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వడంపై స్పందిస్తూ అది తాను లెక్కలోకి తీసుకునే అంశం కాదన్నారు. జగన్ మోడీని కలవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. అలాగే జగన్ కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు చెప్పారు. ఈ విషయమై రోజూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అవినీతిరహిత దేశమే ఆశయమని మోడీ, తాను చెప్పామని బాబు గుర్తుచేశారు. అవినీతిని ప్రక్షాళన చేయడంతోపాటు అవసరమైతే అవినీతిపరులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేసే సంస్కరణలు కూడా తెస్తామన్నారు. ఆర్థిక, న్యాయపరమైన, పరిపాలనాపరమైన సంస్కరణలు కూడా తెస్తామని వివరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తారా? అని అడగ్గా ఆయన పదవులను ఆశించి ఎన్నికల ప్రచారానికి రాలేదని బాబు చెప్పారు. కానీ ఆయన సలహాలను తీసుకుంటామన్నారు. రాజధాని నగర ప్రాంతమై ఉండాలి... ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అందరికీ మధ్యలో ఉండాలని, నగర ప్రాంతమై ఉండాలని చంద్రబాబు అన్నారు. విభజన చేసేటప్పుడు హేతుబద్ధత ఉండాలని తాను ముందే చెప్పినా మీడియా తనను అర్థం చేసుకోలేదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతమని ఎగతాళి చేసిందన్నారు. అయితే ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే సీమాం ధ్రలో పట్టంకట్టారని, తెలంగాణలోనూ తనను అభిమానించారని బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల అభద్రతా భావాన్ని తాము తొలగిస్తామని చంద్రబాబు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రజలందరినీ ఒక్కటి చేసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. హస్తినలో బాబు బిజీబిజీ న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల అనంతరం హస్తినకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలు గెలవడంతో బీజేపీ అగ్రనేతలందరినీ కలిసి అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో తమకు దక్కే స్థానాలకు సంబంధించి సమాలోచనలు చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో తమ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కుతుందో లేదోనన్న మీమాంసలో ఉన్న బాబు ఆ పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీ నేత వెంకయ్యనాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించేలా బీజేపీ అగ్రనాయకులను ఒప్పించాలని వెంకయ్యను బాబు కోరినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న బాబు...ఆపై ఏపీ భవన్‌లోని ముఖ్యమంత్రి కాటేజీకి చేరుకొని ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో భేటీ అయ్యారు. ఎన్డీఏపక్షాల భేటీ అనంతరం బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో కాసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత గుజరాత్ భవన్ చేరుకొని నరేంద్రమోడీతో సుమారు అరగంటపాటు ఏకాంత చర్చలు జరి పారు. రెండు కేబినెట్ పదవులు, ఒక ఇండిపెండెంట్ మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. చివరగా బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీని కలిసి తిరిగి ఏపీభవన్‌కు చేరుకున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే: వెంకయ్య
హైదరాబాద్: సీమాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉందని, అది కాద నలేని వాస్తవమని అన్నారు. అయినప్పటికీ టీడీపీ- బీజేపీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమికి స్థానిక ఎన్నికల్లో వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని బుధవారం విలేకరులకు తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణలో హంగ్ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 300 వరకు సీట్లు వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి దేశహితం కోరి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిపై నరేంద్ర మోడీ ఆరా తీశారు. బుధవారం వెంకయ్య నాయుడుకు ఫోను చేసి తాజా పరిణామాలపై చర్చించారు. -
వైఎస్ఆర్ సీపీ నెగ్గిన మున్సిపాల్టీలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో హోరాహోరీగా ఫలితాలు సాధిస్తోంది. సోమవారం మున్సిపల్ కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు వెలువడ్డాయి. సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, ఇచ్చాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లతో పాటు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఇక తుని, పులివెందుల, బొబ్బిలి మున్సిపాల్టీలతో పాటు కడప, ఏలూరు కార్పొరేషన్లలో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కడపటి సమాచారం అందేసరికి ఫలితాలు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గిన మున్సిపాల్టీలు చీరాల, గిద్దలూరు, ఆదోనీ, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడురు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, ఇచ్చాపురం, ఆముదాలవలస, గొల్లప్రోలు, చిలకలూరిపేట, బొబ్బిలి, జగ్గయ్యపేట, నూజివీడు, పుంగనూరు, పలమనేరు, కడప కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ -
'సీమాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తాం'
పులివెందుల : సీమాంధ్రలో క్లీస్ స్వీప్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో మద్దతుపై తొందరపడబోమన్నారు. రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా జరిగిందని జగన్ అభిప్రాయపడ్డారు. తాను తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని ఆయన తెలిపారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... స్వగ్రామం పులివెందులలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 124వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటల 35 నిమిషాల ప్రాంతంలో ఆయన ఓటు వేశారు. -
సీమాంధ్రలో బీజేపీ ఎంపీ స్థానాల్లోనే మోడీ ప్రచారం
హైదరాబాద్: సీమాంధ్రలో బీజేపీ పోటీచేసే లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. మే 2 నుంచి 4 తేదీల్లో ఏదో ఒకరోజు ఆయన పర్యటించే అవకాశముంది. బీజేపీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో మాత్రమే ఆయన పర్యటిస్తారు. విశాఖపట్నంతోపాటు నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భీమవరం, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మదనపల్లిలో మోడీ పర్యటన కొనసాగనుంది. టీడీపీ పోటీలో ఉన్న లోక్‌సభ స్థానాల్లోనూ ప్రచారం చేయాలని కోరుతున్నా.. అందుకు మోడీ విముఖత చూపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో మరో రోజు కూడా పర్యటించాలని మోడీని టీడీపీ అధినేత కోరినప్పటికీ తేదీలు సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని సమాధానమొచ్చినట్టు సమాచారం. కాగా సీమాంధ్రలో మోడీ పర్యటించే సభల్లో ఒకట్రెండుచోట్ల బాబుతోపాటు పవన్‌కల్యాణ్ పాల్గొనే అవకాశమున్నదని తెలుస్తోంది. -
సీమాంధ్రలో నేడు నామినేషన్ల పరిశీలన
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించే(స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం జరుగుతుంది. ఆయా నామినేషన్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. సక్రమంగా లేనివాటిని తిరస్కరించడంతోపాటు పోటీలో ఎంత మంది మిగిలింది ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగుస్తుంది. అసెంబ్లీకి 4,173, లోక్‌సభ స్థానాలకు 573 నామినేషన్లు ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు 4,173 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 573 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాలయం అన్ని జిల్లాలనుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించింది. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 513 మంది, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 123 మంది నామినేషన్లు దాఖలు చేశారని సీఈవో కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. -
సీమాంధ్రలో ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే మధ్యలో 3 రోజులు సెలవులు వస్తున్నాయి. ఆ సెలవుల రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఈ నెల 13వ తేదీన ఆదివారం సెలవు వస్తోంది. అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతిని, అలాగే 18వ తేదీ గుడ్‌ఫ్రైడేను నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించారు. దీంతో ఈ మూడు రోజుల్లోను నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుదిగడువు. పోలింగ్ మే 7న, ఓట్ల లెక్కింపు 16న జరుగుతాయి -
వైఎస్ చేశారు కాబట్టి తప్పా?
అదే లీజును బాబు హయాంలో ఇస్తే మాత్రం తప్పులేదా? ఓఎంసీకి లీజు మంజూరు చేసింది చంద్రబాబు కాదా? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికొచ్చే సొమ్ము ఒకటేగా? అప్పటికే ఉన్న కంపెనీకి ఇవ్వలేదంటూ పిచ్చి రాతలెందుకు? కొత్త కంపెనీకి ఇస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా! ఓఎంసీకి నాణ్యమైన, విలువైన ఖనిజం కట్టబెట్టేశారని రాసింది మీరేగా? అక్కడ నాసిరకం తప్ప నాణ్యమైన ఖనిజం లేనేలేదని సీబీఐ తేలిస్తే మీ అబద్ధపు రాతలకు క్షమాపణ చెప్పలేదెందుకు? అఖిలపక్షం డిమాండ్ చేయగానే ఓఎంసీకి కమిటీని పంపింది వైఎస్ కాదా? బ్లాక్ గెలాక్సీపై చంద్రబాబు డ్రామాను ఎన్నడూ బయటపెట్టలేదేం? వేల కోట్ల ముడుపులు చేతులు మారినా మీకు కనిపించలేదా? ఇంకెన్నాళ్లు రామోజీ ఈ విషపురాతలు ఇవి ఎన్నికల కామెర్లు. ‘పచ్చ’ పార్టీ కోసం కొనితెచ్చుకున్న పచ్చకామెర్లు. అంతే!! వచ్చే నెల 7న సీమాంధ్రలో పోలింగ్ ముగిసేదాకా రామోజీకి ఈ వ్యాధి తగ్గే చాన్సే లేదు. అందుకే రోజూ ప్రత్యేక పేజీలు పెట్టి మరీ విషం గక్కటం. లేకపోతే బాబు లీజుకిస్తే తప్పులేదట గానీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన లీజులు మాత్రం అన్నీ తప్పేనట!! ఒక కంపెనీకి బాబు ఇస్తే తప్పులేదు గానీ అదే కంపెనీకి వైఎస్సార్ ఇస్తే మాత్రం ఘోరమట!! నామా నాగేశ్వరరావుకు గ్రానైట్ లీజులిచ్చినా, రిలయన్స్‌కు కోస్తా తీరం మొత్తాన్ని కబళించేసుకోవచ్చని వీలునామా రాసేసినా... అవన్నీ జాతి ప్రయోజనాల కోసం చేసినవట!! ఎందుకంటే నామా బాబు అనుచరుడు కాబట్టి... రిలయన్స్ సంస్థ తన కంపెనీల్లో రూ.2,400 కోట్లు ‘‘పెట్టుబడి’’ పెట్టింది కాబట్టి!! ఇది ఏ మార్కు పాత్రికేయం రామోజీ? ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం మీ రాతలతో అంధకారంలో ఉంచుతారు? గురువారంనాడు ‘ఘనులు తీసిన గోతులు’ అంటూ ఒక పేజీ నిండా వండేసిన మీ కథనం ఏ మార్కు జర్నలిజం? భూమిలో ఉన్న ఖనిజం తవ్వకుండా బయటికొస్తుందా? గనులు తవ్వాక గోతులు రాకుండా ఇంకేం వస్తాయి? ఇవెక్కడి రాతలు? వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి పనికీ దురుద్దేశం అంటగట్టి... దానికి ఆయన్ను బాధ్యుడిని చేస్తూ రాస్తున్న రాతల్లో ‘‘ఏది నిజం?’’ అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఓఎంసీకి 25.99 హెక్టార్లను లీజుకిచ్చింది సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు. 1996, డిసెంబర్ 10న జీవో నంబరు 236 ద్వారా రామ్మోహన్‌రెడ్డికి ఈ లీజుకు అనుమతినిచ్చారు. 1997లో లీజు అగ్రిమెంట్ చేసుకున్నారు. 2002లో రామ్మోహన్‌రెడ్డి నుంచి ఈ లీజును ఓఎంసీకి బదలాయించింది కూడా చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే. తర్వాత కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్న హామీతో వైఎస్ హయాంలో మరో రెండు లీజుల్ని ఓఎంసీ తీసుకుంది. ఇదీ... జరిగిన కథ. వైఎస్ ఇలా చేయటం వల్ల ప్రజా సంపద దుర్వినియోగమెలా అవుతుంది? ఎవరి హయాంలో లీజుకిచ్చినా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గానీ, పన్నుల రూపంలో గానీ వచ్చే సొమ్ములో తేడాలుంటాయా? ఏ కంపెనీకిచ్చినా సర్కారుకు వచ్చే సొమ్ము ఒకటేకదా! అయినా వెనకబడిన కడప జిల్లాలో 2 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఆరంభించి 10 మిలియన్ టన్నుల స్థాయికి విస్తరించేలా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించబట్టే ఓఎంసీకి వైఎస్ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది తప్ప ఊరికేకాదు. ఈ విషయాన్ని వైఎస్ అసెంబ్లీలోనే చెప్పారు. ఇందులో తప్పేంటి? అప్పటికే నడుస్తూ ఉన్న శాతవాహన లాంటి సంస్థలను పక్కనబెట్టి ఓఎంసీకి లీజుకు ఇచ్చేశారంటూ రామోజీ గగ్గోలు పెట్టారు. శాతవాహన ప్లాంటు నడుస్తోందంటే దానర్థమేంటి? దానికి ఖనిజం ఉన్నట్లేగా? దీనికి లీజు ఇవ్వడం కంటే కొత్త సంస్థకు ఇస్తే మరో ఫ్యాక్టరీ వస్తుందని, దీనివల్ల మరికొన్ని వేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆలోచించటం తప్పా? రామోజీకి ఈ మాత్రం లేదా? అడ్డగోలుగా లీజులు కేటాయించారన్న రామోజీ వాదనలో నిజమెంత? లీజు కోసం వచ్చిన 30 దరఖాస్తుల వివరాలనూ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించటం, వాటన్నిటినీ పరిశీలించాక కేంద్రం ఓఎంసీకి లీజుకివ్వటం... ఇవన్నీ రామోజీకి మాత్రమే అడ్డగోలుగా కనిపిస్తాయెందుకు? తన కవల లాంటి చంద్రబాబు చేయలేదనా? లీజుల కేటాయింపులు, రాయల్టీ వసూలుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ఓఎంసీ కోసం ఏమైనా సవరించాయా? అందరికీ వర్తించిన నిబంధనల్నే దీనికీ అమలు చేశారుగా? చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఈ విధానం ప్రకారమే లక్షల హెక్టార్లకు లీజులు ఇచ్చారుగా? దీన్లో వైఎస్ మాత్రమే చేసిన తప్పేంటి? ఈ మతలబు మీకు తెలీదా రామోజీ? ప్రకాశం జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన అత్యంత అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ 1998 డిసెంబర్ 23న చంద్రబాబు నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీఎండీసీకి గనులను రిజర్వు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ప్రతిపాదనలు విరమించుకుంటే అత్యంత భారీ స్థాయిలో ముడుపులు ముట్టజెబుతామంటూ అప్పటి ప్రభుత్వ పెద్దతో కొందరు ప్రైవేటు ప్రతినిధులు రాయబారాలు నడిపారు. ఆయన కోరుకున్నదీ అదే. ఆయన ఆశించిందీ అదే. బాబు వ్యూహం మేరకు చర్చలు జరిగాయి. మంతనాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం... ప్రభుత్వ పెద్ద నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు లేఖ రాశారు. ‘చీమకుర్తి, తాళ్లూరు మండలాల్లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలున్న ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది’ అన్నదే ఆ లేఖ సారాంశం. ఏపీఎండీసీకి గనుల రిజర్వేషన్ ప్రతిపాదనను విరమించుకున్న చంద్రబాబు సర్కారు చకచకా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి లీజులు మంజూరు చేసేసింది. జూలై 2000 నుంచి మార్చి 2004 మధ్య ఏకంగా 155 లీజుల కింద 363.945 హెక్టార్ల గ్రానైట్ క్వారీలను లీజుకు ఇచ్చేసింది. ఈ మొత్తం తతంగం ‘ఈనాడు’కు ఏనాడూ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే ఈ గలీజు కథ నడిపింది తన కవల లాంటి చంద్రబాబు కాబట్టి. వేరే రకంగా ఈ కుంభకోణం బయటకు రాలేదెందుకంటే... అప్పట్లో ‘సాక్షి’ లాంటి మీడియా లేదు కాబట్టి. ఉన్నదల్లా బాకా పత్రికలు, తోకపత్రికలే కాబట్టి!!! ఏమంటారు రామోజీ? ఇది కాదా అసలు నిజం!! ఇవీ... ‘ఈనాడు‘ అడ్డగోలు రాతలు.. వైఎస్ ప్రభుత్వం ఓఎంసీకి అత్యంత నాణ్యమైన, విలువైన ఖనిజాన్ని కట్టబెట్టిందని, దాన్ని తవ్వేసి లక్షల కోట్లు గడించారని గతంలో రాసింది ‘ఈనాడే’. అయితే సీబీఐ దర్యాప్తు జరిపి... ఈ ప్రాంతంలో నాసిరకం ఖనిజం మాత్రమే ఉందని తేల్చటంతో మరో రాగం అందుకుంది. చుట్టుపక్కల వేరేవారు తవ్విన ఖనిజాన్ని... బెదిరించి గాలి జనార్దనరెడ్డి తక్కువ రేటుకు కొని, ఈ లీజు పర్మిట్‌తో ఎగుమతి చేశారని!! అంతే తప్ప తాను మొదట్లో రాసిన కథనాలన్నీ తప్పయినందుకు ఏనాడూ క్షమాపణ చెప్పింది లేదు. మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి? రామోజీ రాతల్లో నిజమెంతో అర్థం కావటం లేదా? పెపైచ్చు తానేం చెప్పినా ‘ఎస్’ అనే అధికారుల్నే వైఎస్ పెట్టుకున్నారంటూ మరో దిగజారుడు రాత. ఏం! శ్రీలక్ష్మిని గానీ, కృపానందాన్ని గానీ ఐఏఎస్‌కు ఎంపిక చేసింది వై.ఎస్.రాజశేఖరరెడ్డా? వాళ్లు చంద్రబాబు హయాంలో పనిచేయలేదా? పర్మిట్లపై ఓఎంసీకి అంటగడుతున్న అభియోగాలన్నీ కోర్టులో ఉన్నవేగా? వాటిపై రామోజీ తీర్పులెందుకు? అయినా క్షేత్ర స్థాయిలో అధికారులో, సిబ్బందో తప్పు చేస్తే అది ముఖ్యమంత్రికెలా తెలుస్తుంది? ఆంధ్ర-కర్ణాటకల మధ్య గనుల సరిహద్దు రేఖలను తేల్చాలని రెండు రాష్ట్రాలూ ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా ఇప్పటికీ తేలలేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సరిహద్దును ఖరారు చేయాలని సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించి ఏడాదైనా ఇంకా మల్లగుల్లాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సరిహద్దు రేఖ తేలే వరకూ ఏ లీజు సంస్థ ఎక్కడ అక్రమ తవ్వకాలు జరిపిందో నిర్ధారించలేమని సీబీఐ కూడా చెప్పింది. మరి ఈ వాస్తవాలన్నీ పక్కనబెట్టి రామోజీ రాస్తున్న రాతల్లో నిజం ఎంత? అయినా ఓఎంసీని వైఎస్ ఏనాడైనా వెనకేసుకొచ్చారా? ఆ సంస్థ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడుతోందని, అఖిలపక్షాన్ని పంపాలని విపక్షాలు అడగ్గానే విపక్ష కమిటీని ఓబుళాపురం గనులకు పంపింది వైఎస్ కాదా? అక్కడికి వెళ్లొచ్చిన సభ్యులు తమ దృష్టికి ఎలాంటి అక్రమాలూ రాలేదని మీడియా సమక్షంలోనే ప్రకటించారు. ఇక బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ఓఎంసీకి మధ్య సరిహద్దు వివాదం తలెత్తగా దానిపై ఉన్నతస్థాయి సర్వే బృందాన్ని నియమించిందీ వైఎస్సే. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేస్తారు? ఇవన్నీ వదిలిపెట్టి రామోజీ రాస్తున్న రాతలకు అర్థమేంటి? -
విభజనపై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు
-
కిరణ్, బాబు, మనోహర్ కుమ్మక్కు
-
చరిత్ర హీనులుగా మిగిలిపోతారు : వైయస్సార్సీపి
-
ఒంగోలులో పనబాక లక్ష్మీకి సమైక్య సెగ
-
కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు
-
అంతన్నాడు... ఇంతన్నాడే.. గంగరాజు..
-
రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి రాస్తారోకో
-
పురందేశ్వరి క్యాంపు కార్యాలయంపై కోడిగుడ్ల దాడి
-
పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం ?
-
కేంద్రం మెడలు వంచింది మేమె
-
సచివాలయ ఉద్యోగుల నిరసన
-
విభజనపై జనం ఆగ్రహంతో ఉన్నారు
-
రాష్ట బీజేపీ నేతల మధ్య 'ఢిల్లీ' చిచ్చు
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో కూడా చిచ్చు రగిల్చింది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మధ్య మాత్రమే చోటు చేసుకున్న విభేదాలు కాస్తా బీజీపీకి పాకాయి. రెండు ప్రాంతాలలోనూ ఒకే ఎజెండాతో ముందకు వెళుతున్నామని చెప్పిన నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ ను రద్దు చేయడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. సీమాంధ్ర నేతల ఢిల్లీ టూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ పెద్దలు, తెలంగాణ నేతల పర్యటనను రద్దు చేయడంతో ముసలం మొదలైంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నేతలకు అంగీకారం తెలిపి, తెలంగాణ నేతల పర్యటనను రద్దు చేయడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఓ దశలో తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. -
జతకలిసిన రైతు బజారు సిబ్బంది
-
రాజీనామాలపై స్పందించిన సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీలు
-
కేబినేట్ నోట్ కు ఆమోదం తర్వాత ఇరుప్రాంతాల్లో శాఖలు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్ నోట్ కు మంత్రివర్గ ఆమోదం లభించాక ఇరుప్రాంతాల్లో బీజేపీ రెండు శాఖలను ఏర్పాటు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పలు పార్టీలు ద్వంద విధానాలను అవలంభిస్తోందని..రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణపై బీజేపీది ఒకటే మాట అని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల తీరు వల్ల ఇరుప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్టీలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దని కిషన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు. -
సభను ఆపే సత్తా ఎవరికీ లేదు: అశోక్‌బాబు